
పవన్ కల్యాణ్ మౌనంతో కాపుల్లో ఆవేదన
సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
పొన్నూరు: ప్రముఖ సినీ నటుడు, తన అన్న చిరంజీవిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అవమానించేలా దారుణంగా మాట్లాడినా ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించక పోవడం చిరంజీవి అభిమానులు, కాపు నాయకులను ఆవేదనకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. అంతటి అవమానం జరిగినా తన స్వార్థ రాజకీయం కారణంగానే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే బాలకృష్ణ సైకో అనడం, అదేవిధంగా సినీ పరిశ్రమలోనే దిగ్గజ నటుడు చిరంజీవిని అవమానించే విధంగా మాట్లాడటం ఎంతో బాధను కలిగించిందన్నారు. వై.ఎస్.జగన్, చిరంజీవిలను అభిమానించే వ్యక్తిగా ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్, నాగబాబుల నుంచి ఎందుకు స్పందన లేదని సూటిగా ప్రశ్నించారు. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వ్యక్తి చిరంజీవి అనే విషయాన్ని సోదరులు ఇద్దరూ గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవికి ఉన్న తమ్ముళ్లలందరూ మాట్లాడుతుంటే, వారెందుకు నోరు మెదపరని ప్రశ్నించారు. చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూటమి విధానాలా.. చంద్రబాబు విధానాల అనే అంశాన్ని పవన్ కళ్యాణ్, నాగబాబులు ప్రశ్నించాలన్నారు. దీనిని ప్రజలకు సైతం తెలియజెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని అవమానించడం ద్వారా ఆ సామాజిక వర్గాన్నే అవమానించిన భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. దీనిపై రక్తం పంచుకుపుట్టిన తమ్ముళ్లుగా నిలదీస్తారో.. లేక పదవుల కాంక్షతో కప్పిపుచ్చుతారో అది నాగబాబు, పవన్ కళ్యాణ్‌ల విజ్ఞతకే వదిలి పెడుతున్నానన్నారు.
బాలకృష్ణ దురుసు వ్యాఖ్యలపై
ఉప ముఖ్యమంత్రి , నాగబాబులు
ఎందుకు స్పందించరు ?
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ