
నేటి నుంచి నాటక, నాటిక పోటీలు
తెనాలి: కళల కాణాచి– తెనాలి, ఆర్‌ఎస్‌ఎఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు శనివారం ఆరంభం కానున్నాయి. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఉదయం 10.30 గంటలకు పద్యనాటకం, మధ్యాహ్నం 2.30 గంటలకు పద్యనాటకం, సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభసభ, రాత్రి 7.15 గంటలకు సాంఘిక నాటక ప్రదర్శనలు ఉంటాయి. తర్వాతి రోజు నుంచి ఉదయం నుంచి రాత్రివరకు ప్రదర్శనలు కొనసాగుతాయి. పోటీల ఆహ్వానపత్రికను కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీరచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా శుక్రవారం ఆవిష్కరించారు. వీణాఅవార్డ్స్ నాటకపోటీలకు అనేక సంస్థల నుంచి స్పందన వచ్చిందన్నారు. పద్యనాటకాలు–9, సాంఘిక నాటకాలు–5, సాంఘిక నాటికలు–7 కలిపి మొత్తం 21 ప్రదర్శనలు ఉంటాయన్నారు. సినీనటుడు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ భారీస్థాయిలో జరుగుతున్న పోటీల నిర్వహణ వ్యయప్రయాసలతో కూడుకున్నదని చెప్పారు.