
విజ్ఞాన్ కళాశాలలో దసరా సంబరాలు
గుంటూరు రూరల్: శక్తి స్వరూపిణి దుర్గాదేవి అని విజ్ఞాన్ విద్యా సంస్థల అధ్యక్షుడు డాక్టర్ లావు రత్తయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి కళాశాలలో పూజిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ సంవత్సరం 11 రోజులపాటు పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా పూజించగా, అయిదో రోజున మహాలక్ష్మి దేవిగా గురువారం అలంకరించారని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలనంతరం విద్యార్థులకు దర్శనం కల్పించారు. ఎనిమిదో రోజు సరస్వతి దేవిగా అలంకరణ ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా విజ్ఞాన్ నిరుల మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులకు బతుకమ్మ, దసరా వేషధారణ, దాండియా, సంప్రదాయ వస్త్రధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాధిక తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.