
ఐర్లాండ్‌లో అడ్మిషన్ పేరిట మోసం
కుమార్తెను ఐర్లాండ్‌లో ఎంబీఏ చదివించేందుకు అడ్మిషన్ కోసం గుంటూరు లక్ష్మీపురంలోని వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కన్సల్టెన్సీ నిర్వాహకులకు 2024 జూన్‌లో రూ.12.21 లక్షలు చెల్లించాం. సంస్థ ప్రతినిధి ఎన్.రవికుమార్ మా నుంచి చెక్కుల రూపంలో నగదు తీసుకున్నాడు. పేరు రాయకుండా తీసుకున్న చెక్కులను బి.నీహారిక పేరుతో డ్రా చేసుకున్నాడు. డబ్బు కట్టించుకున్న తరువాత అమ్మాయికి అడ్మిషన్ ఖరారు కాకపోవడంతో పలుమార్లు కన్సల్టెన్సీకి వెళ్లి విచారించగా, రవికుమార్ కార్యాలయంలో ఉండకుండా ఫోన్‌లోనే సమాధానమిస్తున్నాడు. డబ్బు వసూలు చేసి అడ్మిషన్ కల్పించకపోగా, రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటుడంతో తమ బిడ్డ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వ్యవసాయం చేసుకునే రైతునైనా అమ్మాయికి మంచి భవిష్యత్తు కావాలని ఆర్థికంగా భారమైనప్పటికీ పెద్ద మొత్తంలో చెల్లించాం. కన్సల్టెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని, చెల్లించిన డబ్బు తిరిగి ఇప్పించాలి.
–అవిసెన కోటిరెడ్డి, వాలపల్లి, బల్లికురవ మండలం, బాపట్ల జిల్లా
కందుల బ్రోకరేజీ వ్యాపారం చేస్తూ, అవసరమైన వ్యాపారులకు మధ్యవర్తిగా ఉండి సరఫరా చేయిస్తుంటాను. గత తొమ్మిదేళ్లుగా ఆదిలాబాద్‌కు చెందిన సత్యనారాయణ దాల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు అర్జున కేడియా, లలిత్ కేడియాతో వ్యాపారం చేస్తున్నాను. 2024 జూలైలో రెండు దఫాలుగా 3,250 క్వింటాళ్ల కందులను సేకరించి ఆదిలాబాద్‌కు పంపాను. ఇందుకు గానూ వారు రూ.3.54 కోట్లు చెల్లించాలి. ఇంత వరకు పైసా ఇవ్వలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాను. డబ్బు అడిగితే చంపుతామని అర్జున్ కేడియా, లలిత్ కేడియా బెదిరించారు. డబ్బులు ఇప్పించడంతో పాటు తనను బెదిరించిన మిల్లు నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
– సకలా వెంకటేశ్వరరావు, గుంటూరు
నేను వృద్ధుడిని.. వికలాంగుడిని. వృద్ధులమనే కనికరం లేకుండా కన్న కొడుకు దశరథరాము వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగుడుకు బానిసగా మారి, అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. భయంతో పొరుగువాళ్ల ఇంట్లో ఆశ్రయం పొందాం. ఇంటిని ఆక్రమించుకుని, భయభ్రాంతులకు గురి చేస్తున్న కొడుకుపై చర్యలు తీసుకుని, మాకు రక్షణ కల్పించాలి.
–కూరాకుల వెంకట్రావు, నాగ మల్లేశ్వరి,
గుంటూరు
నేను వ్యవసాయం చేస్తున్నాను. గుంటూరుకు యార్డుకు గత పదేళ్లుగా మిర్చి అమ్మకాలు జరుపుతున్నాను. 2024 ఏప్రిల్‌లో మాఊరు అబ్బిరాజుపాలేనికి వచ్చిన పులిపాటి ఆనంద్ మిర్చి పంటను కొనుగోలు చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి 50 బస్తాలను రూ.2.14 లక్షలకు విక్రయించాను. డబ్బు చెల్లించకుండా బెదిరింపు ధోరణలో మాట్లాడుతున్నాడు. తనకు పెద్దల అండ ఉందని, దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరిస్తున్నాడు. ఆనంద్‌పై చర్యలు తీసుకుని, డబ్బు ఇప్పించాలి.
–చిరుమామిళ్ల వెంకట్రావు, పెదకూరపాడు
●

ఐర్లాండ్‌లో అడ్మిషన్ పేరిట మోసం

ఐర్లాండ్‌లో అడ్మిషన్ పేరిట మోసం