
టాప్ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్ అధ్యాపకులకు చోటు
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు అధ్యాపకులు వరల్డ్ టాప్ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని వైస్ చాన్స్‌లర్ పి. నాగభూషణ్ శనివారం తెలిపారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. ఇందులో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ అంబటి రంగారావు, డాక్టర్ కె.చంద్రశేఖర్, ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ రుద్రపాల్ మిథున్, అడ్వాన్డ్‌స్ సీఎస్‌ఈ విభాగానికి చెందిన డాక్టర్ జోత్న్సాదేవి బోడపాటి, కెమికల్ విభానికి చెందిన ప్రొఫెసర్ టి.సుబ్బయ్య, హైదరాబాద్‌లోని ఆఫ్ క్యాంపస్ మెకానికల్ విభాగానికి చెందిన డాక్టర్ ఎండీ రహమాన్‌లు వరల్డ్ టాప్ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఆగస్టు 2025 వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్ సైన్స్ మేట్రిక్స్ క్లాసిఫికేషన్‌లో గల 44 సైంటిఫిక్ ఫీల్డ్స్, 174 సబ్ ఫీల్డ్స్‌ను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించిందని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆరుగురు ప్రొఫెసర్‌లను చైర్మన్ లావు రత్తయ్య, డీన్లు అభినందించారు.