
పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణతో అభివృద్ధి
కొరిటెపాడు(గుంటూరు): భారత ప్రభుత్వం, డీఎఫ్‌ఎస్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్(ఏపీజీబీ) అన్ని శాఖల్లో ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం పట్టాభిపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, రవీంద్రనగర్‌లలో మొక్కలు నాటి విద్యారులతో మాట్లాడారు. పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ మనిషి అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిప్పారు. దీంతో కుటుంబం, గ్రామం, రాష్ట్రం బలపడతాయని, చివరికి దేశాభివృద్ధికి దారి తీస్తుందని వివరించారు. పరిశుభ్రతను పాటించే వారు దేశానికి మరింత ఉత్పాదకతను అందించడంలో దోహదపడతారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకున్న వారు అత్యున్నత స్థానాలకు ఎదగాలని, తాను కూడా అందులోనే చదివానని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.వీరబాబు మాట్లాడుతూ తమ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఇన్‌చార్జి హరీష్ బేధా, ఏపీజీబీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
ఏపీజీబీ చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి