
‘చలో మెడికల్ కాలేజీ’ గ్రాండ్ సక్సెస్
గుంటూరు రూరల్: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘చలో మెడికల్ కళాశాల’ కార్యక్రమానికి రూరల్ మండలం నుంచి విద్యార్థి, యువజన విభాగం నేతలు భారీగా తరలివెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అఽధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు, ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్‌కుమార్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని మెడికల్ కళాశాలకు భారీగా వెళ్లారు. నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు కొండా కోటిరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అమడాల కెనడీల నేతృత్వంలో పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలు భారీగా అక్కడకు వెళ్లారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రలను భగ్నం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జగనన్న నేతృత్వంలో పోరాడతామని పేర్కొన్నారు. పేదల పక్షాన నిలుస్తామని చెప్పారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సమీపంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
తరలి వెళ్లిన యువత
కూటమి ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు