
గుంటూరు
న్యూస్‌రీల్
తెనాలిలో రేషన్ షాపు సీజ్
పులిచింతల సమాచారం
బొడ్రాయికి ప్రత్యేక పూజలు
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సాక్షిపై కూటమి సర్కారు అక్కసు వెళ్లగక్కుతుంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే సాక్షిని నోరు మూయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘ఇస్ ద ప్రెస్ ఇన్ ద హ్యాండ్.. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద గ్రేట్ మాన్‘ అనే మాటలు చంద్రబాబు, లోకేష్ విషయంలో నిజమయ్యాయి. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సరికాదని చెబుతున్నందుకు సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పులు సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు సాక్షిని ఏమీ చేయలేవు.
– మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ
ప్రశ్నించే హక్కు, తప్పొప్పులను వెలికితీసే హక్కు సమాజంలో మీడియాకు ఉంది. వారి హక్కులను, స్వేచ్ఛను హరించేలా వ్యవహరిండం సిగ్గుచేటు. సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు పలువురు జర్నలిస్టులపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో పిలుస్తుండటం మంచిది కాదు. ఏమైనా లోపాలుంటే వివరణ ఇస్తే సరిపోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిది.
– నందిగం సురేష్, మాజీ ఎంపీ, బాపట్ల
7
తెనాలిరూరల్: తెనాలి సాలిపేటలో ఉన్న 39వ నంబర్ రేషన్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఫిర్యాదులు వాస్తవం అని తేలడంతో షాపు సీజ్ చేసినట్టు తెలిపారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు
ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు
వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు.
గుంటూరు రూరల్: వరుస మరణాలతో హడలెత్తిపోతున్న తురకపాలెం గ్రామ ప్రజలు బొడ్రాయికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు.

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు