
లాంలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎమ్ కేంద్ర బృందం పర్యటన
లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో శుక్రవారం నేషనల్ లవ్లీ హుడ్ మిషన్, ఎస్‌ఆర్‌ఎల్‌ఎం న్యూఢిల్లీ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ టీం సభ్యులు లక్ష్మీకాంత్ స్థానిక మహిళా గ్రూపు సభ్యులతో సమావేశమై జీవనోపాధి కోసం చేస్తున్న వ్యాపారాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మండల సమాఖ్య సమావేశంలో గ్రామ సమాఖ్య అధ్యక్షులు వీవోఏలతో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో ఏపీ సెర్ఫ్ టీం అధికారులు వాల్మీకి, ఎం శోభ, ప్రభావతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కుంభా పద్మ, డీఆర్‌డీఏ డీసీఎం శివ ప్రసాద్‌రెడ్డి, ఐబీ ఏపీఎం జగ్జీవన్‌రామ్, తాడికొండ ఏపీఎం ఆర్ సాంబశివరావు, క్లస్టర్ కో ఆర్డినేటర్ పఠాన్ నాగుల్ ఖాన్, సీసీలు, వీవోఏలు సిబ్బంది పాల్గొన్నారు.