నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు

Sep 12 2025 6:21 AM | Updated on Sep 12 2025 6:21 AM

నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు

నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు

నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు

ఏఎన్‌యూ వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు వేడుకగా 49వ వ్యవస్థాపక దినోత్సవం

పెదకాకాని(ఏఎన్‌యూ): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం వేడుకగా జరిగింది. అతిథులు, యూనివర్సిటీ అధికారుల జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, దేశ ప్రగతికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి వృత్తి విద్య కళాశాలలు ఆర్థిక స్థిరత్వం తెచ్చిపెట్టాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలను దీటుగా ఏఎన్‌యూ ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లలో అమెరికా, చైనాను మించి భారత్‌ ప్రగతి సాధించే అవకాశం కనిపిస్తోందని, దీనికి విద్యార్థుల కృషి కూడా అవసరమని తెలిపారు. 1976లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల కంటే నాగార్జున యూనివర్సిటీ ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రెక్టర్‌ ఆచార్య రత్న షీలామణి మాట్లాడుతూ రాబోయే ఏడాది కాలం పాటు స్వర్ణోత్సవ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగో ప్రత్యేకతను వివరించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ పూర్వ ఉప కులపతుల దూరదృష్టి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహద పడిందని కొనియాడారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి ఫలాలు వారి కృషి, పట్టుదల, దార్శినికానికి నిదర్శనం అన్నారు.

పండుగ వాతావరణం

మేధావులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకుల సందడితో పండుగ వాతావరణంలో వర్సిటీ ప్రాంగణం నిలిచింది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతులు గా విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్‌ డి. రామకోటయ్య, ప్రొఫెసర్‌ సి.వి. రాఘవులు, ప్రొఫెసర్‌ ఎల్‌. వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ వి. బాలమోహన్‌దాస్‌, ప్రొఫెసర్‌ వై.ఆర్‌. హరగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ ఏ. రాజేంద్రప్రసాద్‌ లను ఘనంగా సత్కరించారు. ముందుగా ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సందేశాలను అందించారు.

ఉత్తమ అధ్యాపకులకు సన్మానం

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డులు పొందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్‌ జి. చెన్నారెడ్డి, ప్రొఫెసర్‌ పి.పి.ఎస్‌. పాల్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ వి. దివ్య తేజ మూర్తి, ప్రొఫెసర్‌ రమేష్‌ రాజు, డాక్టర్‌ పి. సుధాకర్‌లను సత్కరించారు.కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ లింగరాజు, ప్రొఫెసర్‌ ప్రమీలారాణి, ప్రొఫెసర్‌ పాల్‌ కుమార్‌, పాలకమండల సభ్యులు ప్రొఫెసర్‌ సుమంత్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ జగదీష్‌ నాయక్‌, ఓఎస్‌డీ ఆచార్య రవికుమార్‌, సీడీఈ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. వెంకటేశ్వర్లు, రూసా డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. మురళీమోహన్‌, సీడీసీ డీన్‌ ఆచార్య వి. రవికుమార్‌, సీడీఈ పరీక్షలు కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రన్‌, యూజీ పరీక్షల కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి. కృష్ణారావు, నూట అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్‌ బ్రహ్మాజీరావు, ప్రొఫెసర్‌ త్రిమూర్తిరావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌, శ్రీనివాసరావు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement