
ఎయిమ్స్‌లో ‘ఎస్పికాన్’ డిక్లరేషన్ ఆవిష్కరణ
మంగళగిరి: అనారోగ్యం, మరణాల ముప్పును ఎదుర్కొనేందుకు ఎస్పికాన్– 2025 డిక్లరేషన్‌ను మంగళగిరి ఎయిమ్స్ విడుదల చేయడం అభినందనీయమని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సెలెన్స్ న్యూఢిల్లీ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. సోమవారం ఎయిమ్స్‌లో డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్‌షిప్ కోసం ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని వివరించారు. క్లినికల్ మైక్రోబయాలజీ , జనరల్ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ విభాగాల సహకారంతో సొసైటీ ఫర్ యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్ షిప్ ప్రాక్టీషస్ ఇన్ ఇండియా(సెస్పీ) జాతీయ వార్షిక కాన్ఫ్‌రెన్స్ ఎస్పికాన్– 2025ని విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. భారతదేశం అంటు వ్యాధుల భారాన్ని ఎదుర్కుటోందని తెలిపారు. ఉష్ణమండల వాతావరణం, పరిశుభ్రత గురించిన అపోహలు వన్ హెల్త్ విధానానికి సవాళ్లు మరింత తీవ్రమయ్యాయని వివరించారు. మందులు ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) లభ్యత కారణంగా సాధారణ బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు అనేక ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ మప్పును ఎదుర్కునేందుకు ఎస్పికాన్–2 ల్యాండ్ మార్క్ ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంత సింగ్, సెస్పీ అధ్యక్షురాలు డాక్టర్ సరితా మోహపాత్ర, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమిత్ రాయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దేబబ్రత దాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. పాండా, డీన్ డాక్టర్ డి. రామ్మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నటరాజ్ పాల్గొన్నారు.