మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి! | - | Sakshi
Sakshi News home page

మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!

Sep 7 2025 7:46 AM | Updated on Sep 7 2025 7:46 AM

మొక్క

మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!

మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!

నగరంలోని డివైడర్ల మధ్య మట్టి నింపి నాటేందుకు ఏర్పాట్లు ఇటీవల సీఎం పర్యటన సమయంలో రూ.30 లక్షల వరకు ఖర్చు ఇప్పుడు మరో 45 వేల మొక్కలు తీసుకొచ్చిన అధికారులు మట్టి నింపడం, మొక్కలు నాటేందుకు ఏకంగా రూ.కోటి వ్యయం టెండర్‌ పిలవకుండా పనులు అప్పగించడంపై పలు విమర్శలు

కూటమి వచ్చాక ప్రజాధనం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. దొరికినంత దోచుకునేందుకు పచ్చనేతలు, ఆ ముసుగులోని కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ సొమ్ము ఫలహారంలా ఆరగించేస్తున్నారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొక్కల పెంపకం పేరిట రూ.కోటి వరకు ఖర్చు చేశారు. పైగా టెండర్లు పిలవకుండా అయినవారికి పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మొక్కలనే అధికారులు సంరక్షించడం లేదు. పైగా కొత్తగా కొన్ని వేల మొక్కలను తెప్పించారు. వాటి సంరక్షణ సంగతి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీటికోసం డివైడర్లలో కొత్తగా మట్టిని నింపుతున్నారు. ఈ రెండు పనులు చేసినందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

టెండర్‌ ప్రక్రియ లేకుండానే?

టెండర్లు వేయకుండానే నకిలీ పత్రాలు పెట్టి కొందరు టెండర్లు దక్కించుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొక్కలు తీసుకొచ్చేందుకు కూడా టెండర్‌ పిలవలేదని సమాచారం. నామినేషన్‌ పద్ధతిలో మొక్కలు, మట్టిని తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిని నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో దించారు. మట్టిని మాత్రం రోడ్లపై పోసి గతంలో ఉన్న పాత మట్టిని తొలగించి కొత్తగా నింపుతున్నారు.

టీడీపీ కార్పొరేటర్లే వద్దన్నా..

గతంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం రూ.30 లక్షలకుపైగా వెచ్చించి గుంటూరుకు మొక్కలు తీసుకొచ్చారు. అవి పాడైపోవడంతో సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్లీ మొక్కలు తెప్పించే అంశంపై టీడీపీకి చెందిన కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. ఉన్న మొక్కలను సంరక్షించకుండా కొత్తవి ఎందుకని అధికారులను పలు సందర్భాల్లో ప్రశ్నించారు. వారి తీరు మాత్రం మారలేదు. మొక్కలను తెప్పించారు. డివైడర్లలో ఉన్న మొక్కలు చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. వీటి సంరక్షణను పట్టించుకోవడం లేదు. దీంతో ఎండిపోతున్నాయి.

మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!1
1/1

మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement