
రైతులను అవమానించేలా సర్కార్ వైఖరి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు యూరియా, ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం ఎరువులకు బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధర పెడుతున్న రైతులు 9న ‘అన్నదాత పోరు’కు పార్టీ శ్రేణులు, రైతులు తరలిరావాలని పిలుపు
ఫిరంగిపురం: రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ నిలుస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌బాబు) అన్నారు. మండలంలోని అల్లంవారిపాలెంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరు, రైతన్నకు బాసటగా వైఎస్సార్‌సీపీ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ... యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని తెలిపారు. రైతుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎరువుల కోసం రైతులు బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన కూటమి నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్‌సీపీ పనిచేస్తుందన్నారు. పార్టీ రైతు విభాగం నాయకులు ఎం. రాఘవరెడ్డి, కె. రామారావు, నాయకులు మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కె.చిన్నప్పరెడ్డి, దాసరి సురేష్, చిట్టా అంజిరెడ్డి, దాసరి మెల్కియా, ఎస్ చిన్నప్ప, పెరికల చిన్న, కె.ప్రవీణ్‌రెడ్డి, వై.హేమలతారెడ్డి, చేవూరిరామమోహన్‌రెడ్డి, షేక్.మస్తాన్‌వలి, కె.బ్రహ్మారెడ్డి, బి. అంజిరెడ్డి, టి.కృష్ణ, జుబేర్, ఎం.రాయప్ప, జె.ఆనంద్, ఇజ్రాయిల్, పిచ్చిరెడ్డి, ప్రతాప్‌దేవ్, కె.రాజు, పి.శ్రీనివాసరెడ్డి, ఎస్.సైదులు, బాలిరెడ్డి, సాల్మన్, డి.బాబురావు, డి.నరేంద్రకుమార్, కె.శ్రీనివాసరెడ్డి, చిన్నసుబాని, రాంబాబు, ఎం.గోపి, రోశయ్య, మోరంరెడ్డి, డి.శ్రీను, వెంకట్, పి.శ్రీనివాసరెడ్డి, వెంకట్, రవి. వెంకట్రావులు పాల్గొన్నారు.