అంగన్‌వాడీలపై అడ్డగోలు పెత్తనం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలపై అడ్డగోలు పెత్తనం

Aug 8 2025 7:45 AM | Updated on Aug 8 2025 7:45 AM

అంగన్

అంగన్‌వాడీలపై అడ్డగోలు పెత్తనం

గుంటూరు అర్బన్‌ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలపై సూపర్‌వైజర్లు, ఇతర అధికారుల అడ్డగోలు పెత్తనం ఎక్కువైంది. తమకు అనుకూలంగా ఉండే వారిని మిగతా కార్యకర్తల వద్దకు విజిట్‌ల పేరుతో పంపి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సాకుతో వారి పనులన్నీ తమతో చేయిస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంతో కొంత సమర్పించుకున్న వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో పరిస్థితిదీ..

అంగన్‌వాడీ

కేంద్రాల సంఖ్య 1,480

6 నెలల నుంచి మూడేళ్లలోపు వారు 49,976 మంది

బాలింతలు 7,009 మంది

నెహ్రూనగర్‌: బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేస్‌ రికగ్నేజేషన్‌ సిస్టం) ద్వారా జరుగుతుంది. ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో సూపర్‌వైజర్లు చేయాల్సిన పనిని కూడా తమకు నచ్చని అంగన్‌వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారు. దీంతో ప్రీ స్కూల్‌ నిర్వహణ సక్రమంగా లేదు. మరోవైపు అంగన్‌వాడీలు చేయాల్సిన విధుల్లో ఆలస్యమైతే మెమోలు ఇస్తున్నారు. గుంటూరు అర్బన్‌ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు పదవీ విరమణ పొందిన స్థానాల్లో అక్కడ పనిచేస్తున్న ఆయాకు అర్హతలను బట్టి కార్యకర్తగా పదోన్నతి కల్పిస్తారు. ఇలా ఎవరైనా పొందితే రూ.1.50 లక్షలు వరకు ఇవ్వాలని అధికారులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేదంటే రోజూ విజిట్ల పేరుతో వేధిస్తున్నారు.

అదనపు భారంతో బెంబేలు

అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలలో పది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వీటి నిర్వహణ కోసం కార్యకర్తపై రూ.1,500 నుంచి రూ. 2 వేల వరకు అదనపు భారం తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆర్‌టీఐ విజిట్‌ల పేరుతో వచ్చే వారిని మేనేజ్‌ చేసేందుకు ప్రతి కేంద్రం నుంచి రూ.200 సమర్పించాలని అధికారులు సూచించడంతో ఆ మొత్తం కూడా వీరే ఇస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సరుకులు ఎండీఎం వాహనాల ద్వారా రేషన్‌ షాపు నుంచి సరఫరా అయ్యేవి. ఇప్పుడు రేషన్‌ షాపు నుంచి ఆటోలో ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కార్యకర్తలు వాపోతున్నారు. తమకు ఇచ్చే రూ.11,500 జీతంలో ఇలా ఖర్చులు పోతే మిగిలేదేమీ ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి. ప్రసూనను దీనిపై వివరణ కోరగా.. సరుకులను సూపర్‌వైజర్‌ తీసుకుంటున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వివరాలు సమగ్రంగా పరిశీలించాక తప్పు ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

3– 6 సంవత్సరాలలోపు చిన్నారులు

14,771 మంది

గర్భిణులు

9,148 మంది

తాము చేయాల్సిన పనులూ అప్పగిస్తున్న సూపర్‌వైజర్లు, పై అధికారులు అనుకూలంగా ఉండే సిబ్బందికి అనధికార సెలవులు మంజూరు విజిట్‌ల పేరుతో మిగతా వారిపై నిత్యం వేధింపులు గుంటూరు అర్బన్‌ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు తప్పని కష్టాలు

ప్రసన్నం చేసుకుంటే అంతా ఓకే..

సూపర్‌వైజర్లను, ఆపై అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు కార్యకర్తలకు అనధికార సెలవులు ఇస్తున్నారు. దీంతోపాటు ఆయా కేంద్రాలకు విజిట్‌కు వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అధికారుల అండదండలు ఉండటంతో మేనేజ్‌ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల అర్బన్‌ పరిధిలోని ఓ సూపర్‌వైజర్‌ బయట సరుకులు తేవాలని ఓ అంగన్‌వాడీ కార్యకర్త భర్తను బెదిరించారు. ఆయన ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తుండటంతో ఫోన్‌ చేసి కావాల్సిన వస్తువులను తెప్పించుకున్నట్లు సమాచారం. నెల నెలా ఇలా చేస్తుండటంతో విసిగిపోయిన ఆయన కొద్ది నెలల క్రితం అర్బన్‌ సీడీపీఓ కార్యాలయం వద్దకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు.

అంగన్‌వాడీలపై అడ్డగోలు పెత్తనం1
1/1

అంగన్‌వాడీలపై అడ్డగోలు పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement