
శ్రావణ మాసంలో భ్రమరాంబకు విశేష అలంకరణలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణమాసం పురస్కరించుకుని మొదటి శుక్రవారం భ్రమరాంబ అమ్మవారిని పలు పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శ్రావణ మాసమంతా శుక్రవారాల్లో అమ్మవారు పసుపు కొమ్ములు, గాజుల అలంకరణ, చీరల అలంకరణలో దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా శ్రీ భమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకొని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు. భక్తులందరికీ స్వామివారి తీర్థ, ప్రసాదాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.