
గుంటూరు
శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మేలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో అర్హత సాధించి, వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఎస్సీహెచ్‌ఈ) సీట్లను కేటాయించింది. ముందుగా విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం మంగళవారమే కేటాయింపు జరగాల్సి ఉండగా, ఒకరోజు ఆలస్యంగా బుధవారం సాయంత్రం సీట్ అలాట్‌మెంట్ జరిపింది.
తొలి ప్రాధాన్యం కంప్యూటర్ సైన్స్
సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అధిక డిమాండ్ నెలకొంది. సీఎస్‌ఈతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఐఓటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌ల వారీగా విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదు సమయంలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. సీఎస్‌ఈ తరువాత ఐటీ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ బ్రాంచ్‌లను ఎంపిక చేసుకున్నారు.
90శాతం సీట్లు భర్తీ
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో అంటుబాటులో ఉన్న 30,240 సీట్లలో 90శాతం మేరకు భర్తీ అయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంతో పాటు నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు, అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీఎస్‌ఈతో పాటు అనుబంధ విభాగాల్లో సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి. మిగిలిన 10 శాతం సీట్లలో సీఎస్‌ఈ మినహా వివిధ బ్రాంచ్‌లలో ఉన్నాయి.
7
న్యూస్‌రీల్
బ్రాంచ్‌ల ఎంపికలో మొదటి ప్రాధాన్యత సీఎస్‌ఈకే.. పూర్తయిన ఏపీఈఏపీ సెట్–2025 మొదటి దశ సీట్ల కేటాయింపు ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, అనుబంధ బ్రాంచ్‌లలో పూర్తిస్థాయిలో భర్తీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 36 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 30,240 సీట్లు వీటిలో 90 శాతం మేరకు భర్తీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ కళాశాలల్లో చేరేందుకు రేపటి వరకు గడువు ఇచ్చిన ఉన్నత విద్యామండలి
ఆగస్టు 4 నుంచి తరగతులు
కళాశాలల్లో చేరేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శనివారం వరకు గడువు విధించింది. ఏపీ ఈఏపీసెట్–2025 సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ప్ జాయినింగ్ రిపోర్టును డౌన్‌లోడ్ చేసకున్న విద్యార్థులు సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంది. ఆగస్టు 4వ తేదీ నుంచి బీటెక్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి.

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు