ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది

Jul 25 2025 4:35 AM | Updated on Jul 25 2025 4:35 AM

ప్రభు

ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు ఆర్టీఐ చట్టం వర్త

నరసరావుపేట: ప్రభుత్వ సహకారం, సహాయం పొందుతున్న అన్ని సంస్థలు, శాఖా కార్యాలయాలకు సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని జిల్లా సహకార అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. గురువారం ప్రకాష్‌నగర్‌లోని జిల్లా సహకార బ్యాంక్‌ సమావేశం హాలులో సమాచార హక్కు–2005పై అవగాహన సదస్సును ఉద్యోగులు, బ్యాంకు సిబ్బంది, ప్రాథమిక సహకార సంఘాల సీఈఓలకి సబ్‌ డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ అధికారి స్వర్ణ చినరామిరెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 1964 ఏపీ సీఎస్‌ చట్టం కింద రిజిస్టరైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయని అన్నారు.

● డివిజనల్‌ సహకార అధికారి కె.తిరుపతయ్య మాట్లాడుతూ పౌర సమాచార అధికారి, అప్పిలేట్‌ అధికారి, సమాచార కమిషనర్‌ అధికార పరిధి, విధి విధానాలను, సమాచార విషయాల గురించి వివరించారు. సమాచార హక్కు ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమని అధికారులు, పౌరులు పరస్పరం బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరిస్తూ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా ప్రజాఅవసరాలకు ఉపయోగించుకోవాలని అన్నారు.

● విజయవాడ కో–ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ రంగరాజు, ఎస్‌డీఎల్‌ సీఓ రామిరెడ్డి, డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ జీపీడీ టాండన్‌లు మాట్లాడారు. జీడీసీసీ బ్యాంకు నరసరావుపేట బ్రాంచ్‌, సహకార శాఖ పల్నాడు జిల్లా కార్యాలయం, డివిజనల్‌ కో–ఆపరేటివ్‌ కార్యాలయ, సబ్‌ డివిజనల్‌ కార్యాలయ సిబ్బంది, నరసరావుపేట తాలూకాలోని 18 పీఏసీఎస్‌ల సీఈఓలు పాల్గొన్నారు.

నవయుగ కవి చక్రవర్తి జాషువా

చిలకలూరిపేటటౌన్‌: బాల్యంపై ఉన్న మమకారమే తనను బాల సాహిత్యకారుడిగా తీర్చిదిద్దిందని ప్రముఖ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ పేర్కొన్నారు. స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సత్యాలను కవిత్వంతో మేళవించి, సమాజోద్ధరణకు పూనుకున్న గొప్ప కవి, నవయుగ కవిచక్రవర్తి జాషువా అని అభివర్ణించారు. తనకు సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘కబుర్ల దేవత’ పుస్తకంలోని విశేషాలను ఆయన వివరించారు.

● విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు అజయ్‌ బాబు మాట్లాడుతూ దళితుల ఆక్రందనలు, ఆకలి కేకలు కవిత్వీకరించి, అనాథలను, అభాగ్యులను కవితా వస్తువులుగా ఎన్నుకుని సమాజాన్ని ధిక్కరించిన కవిదిగ్గజం జాషువా అని కొనియాడారు. విశ్రాంత ఎకై ్సజ్‌ సీఐ గోరంట్ల నారాయణ జాషువా పద్యాలు హృద్యంగా ఆలపించారు. జాషువా వర్ధంతిపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేయగా, సొసైటీ ప్రతినిధులు శివకుమార్‌ను ఘనంగా సత్కరించారు. ముందుగా పట్టణ ప్రముఖులు తోట రామచంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాహితీ విమర్శకులు డాక్టర్‌ పీవీ సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గేరా యాకోబు పాల్గొన్నారు.

ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు ఆర్టీఐ చట్టం వర్త1
1/1

ప్రభుత్వ సహకారం పొందే సంస్థలు, శాఖలకు ఆర్టీఐ చట్టం వర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement