
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పర్వీన్
గుంటూరు ఎడ్యుకేషన్: బిహార్‌లో జరగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు టీజేపీఎస్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థిని కె. పర్వీన్ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి తెలిపారు. పట్టాభిపురంలోని కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ నెల 12న నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి లేజర్ రన్ పోటీల్లో భాగంగా అండర్–17 విభాగంలో తృతీయ స్థానంలో నిలిచిన పర్వీన్.. 15న ఏఎన్‌యూలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన మీట్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం, 100 మీటర్ల హార్డిల్స్‌లో ద్వితీయ స్థానం పొందినట్లు వివరించారు. త్వరలో బిహార్‌లో జరగనున్న జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణం అన్నారు. విద్యార్థినిని కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం అభినందించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అనితాదేవి, వ్యాయామ అధ్యాపకులు టి. వాసుదేవరావు, కోచ్ ఆర్.శివాజీ, అధ్యాపకులు పాల్గొన్నారు.