
విత్తన దుకాణాలలో తనిఖీలు
రూ.60.17లక్షల మిరప, సోయాబిన్స్ విత్తనాల విక్రయాల నిలుపుదల
కొరిటెపాడు: గుంటూరు నగరంలో వ్యవసాయ శాఖ, విజిలెన్‌న్స్/ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సంయుక్తంగా విత్తనాలు, ఎరువులు/ పురుగుమందుల తయారీదారులు, టోకు వర్తకులు, రిటైల్ డీలర్ల దుకాణాల్లో రెండు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మూడు విత్తన దుకాణాల్లో రూ.60.17లక్షల విలువైన మిరప, సోయాబిన్స్ విత్తనాలకు సంబంధించి రికార్డులు లేనట్లుగా గుర్తించారు. దీంతో వాటి విక్రయాలు నిలుపుదలచేశారు. నాలుగు ఎరువుల దుకాణాల్లో రూ.1.66 లక్షల విలువైన 5.35 టన్నుల ఎరువులు, మూడు పురుగు మందుల దుకాణాల్లో రూ.14.13 లక్షల విలువైన 3,460 లీటర్ల పురుగు మందుల విక్రయాలు కూడా నిలుపుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏడీఏ పి.మురళీకృష్ణ, గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, విజిలెన్స్ అధికారులు కె.వెంకటేశ్వర్లు, సీహెచ్.రవిబాబు, ఏఓలు సునీల్ కుమార్, బి.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.