
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నిక
లక్ష్మీపురం: ఉమ్మడి గుంటూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా ఓలేటి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. విజయలక్ష్మి, ఎం.షణ్ముఖ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కార్తిక్, కార్యాలయ కార్యదర్శిగా వి.కల్యాణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్. సరళబాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు నియమితులైనట్లు ఎన్నికల అధికారి బాపట్ల గోపాల కృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారి దేవరపల్లి జగన్నాథం ప్రకటించారు. గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్‌లో ఉన్న వసుంధర కాంప్లెక్స్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావులపాటి శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఉమ్మడి గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా ఓలేటి రమేష్‌కుమార్
ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం