
సుపరిపాలన కాదు.. అబద్ధాల పాలన
తాడికొండ: చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్నది సుపరిపాలన కాదు.. అబద్ధాలు, మోసాల పాలన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడికొండలోని షిర్డీసాయి పర్తిసాయి మందిర కల్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, సూపర్ సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేసి నేతలంతా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఇది సుపరిపాలన కాదు.. మోసపు పరిపాలన అని ప్రజలకు చెప్పడమే బాబు ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమమని వివరించారు. ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ‘‘రాజధానికి రెండో విడత 45 వేల ఎకరాలు కావాలంట.. అప్పట్లో 55 వేల ఎకరాలు సేకరించారు.. దుబాయ్, మలేషియా, సింగపూర్ అంటూ గొప్పలు చెప్పారు.. ఐదేళ్లు ఏమీ చేయలేదు.. అమరావతిలో ఇప్పుడు భూమి కొనేవాడు లేదు.. ముందు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల’’ని రాంబాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తిరేణమ్మ, తాడికొండ, తుళ్ళూరు మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, మైనేని శేషగిరిరావు, తాళ్ళూరు వంశీ, పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు దాసరి రాజు, తాడికొండ గ్రామపార్టీ అధ్యక్షుడు వంగా పోలారెడ్డి, వివిధ విభాగాల నాయకులు కల్లం హరికృష్ణారెడ్డి, చిట్టా అంజిరెడ్డి, మల్లంపాటి రాఘవరెడ్డి, ధూళిపాళ్ల నాగేశ్వరరావు, షేక్ అజీస్, షేక్ బాబావలి, పులి రమేష్, వడ్లమూడి రాజేంద్ర, నిమ్మగడ్డ ప్రసాద్, దెబోరా, కొప్పుల శేషగిరిరావు, చిన్నప్పరెడ్డి, అప్పిరెడ్డి, చేవూరి రామ్మోహనరెడ్డి, గుంటి రఘువరన్, షేక్ అబ్బాస్, అల్లు శ్రీనివాసరెడ్డి, షేక్ రబ్బాని, వలపర్ల కల్పన, కొదమల బుజ్జి, కోలేటి అనీల్, కొప్పుల శేషగిరిరావు, ఆళ్ల చిన్న హనుమంతరావు, చుండు వెంకటరెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికారంలోకి వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యం
పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రథమ ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. కష్ట కాలంలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని పట్టిష్టపరిచే కార్యక్రమం భుజస్కంధాలపై వేసుకున్న దమ్మున్న నాయుడు వనమా బాల వజ్రబాబు అని అభినందించారు. పార్టీ కష్టకాలంలో ముందుకొచ్చి కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్న కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు. భవిష్యత్తులో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయని సూపర్ సిక్స్ మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఏడాది పూర్తయ్యాక తల్లికి వందనం