
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్‌ఎం సుభాని
సత్తెనపల్లి: 12వ పీఆర్‌సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్‌పై పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్‌ఎం సుభాని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురు వారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభు త్వం చేయమన్న పనులు, ఇవ్వమన్న రిపోర్టులు క్షణాల మీద నిద్రాహారాలు మానేసి సమాయానికి ఇస్తున్నా ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావలసిన 12వ పీఆర్‌సీ, ఐఆర్, డీఏలు, ఎరియర్స్ పట్ల మాత్రం మౌనంగా ఉంటున్నారని, ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను నిరాస నిస్ప్రహలకు గురిచేస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలన్నారు.
నెలాఖారులోగా పనులు పూర్తిచేస్తాం
ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి
శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో జరుగుతున్న మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. గురువారం పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వటం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారు ల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న ట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలో ఉన్ననటువంటి మేజరు కాల్వలు రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు.
బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
నెహ్రూనగర్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ప్రతిభావంతులైన పిల్లల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసాధారణమైన ధైర్యసాహసాలతో, సామర్థ్యాలు , అత్యుత్తమ విజయాలు కలిగిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు తగిన గుర్తింపు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు 2026 ప్రకటించిందన్నారు. ఇతరులకు ఆదర్శంగా, క్రీడలు, సామాజిక సేవ, సైన్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి, నూతన ఆవిష్కరణలు మొదలగు వాటిల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్న చిన్నారులు ఈ నెల 31వ తేదీలోగా హెచ్‌టీటీపీఎస్://అవార్డ్స్.జీఓవీ.ఇన్ వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
నీటిగుంటలో పడి వ్యక్తి మృతి
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం