
రోడ్డెక్కిన రేషన్
గుంటూరు
టీడీపీ నేతల కనుసన్నల్లో రేషన్ మాఫియా
శాకంబరిగా పార్వతీ అమ్మవారు
దుగ్గిరాల: దుగ్గిరాల గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు బుధవారం శాకంబరిగా దర్శనం ఇచ్చారు.
అలరించిన భక్తి సంకీర్తన
నగరంపాలెం: స్థానిక ఆదిత్యనగర్‌లోని సాయిబాబా మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి సంకీర్తన అలరించింది.
సాయినాథుని గ్రామోత్సవం
ముప్పాళ్ళ: గురుపౌర్ణమి సందర్భంగా చాగంటివారిపాలెంలోని ప్రసన్న షిరిడీసాయిబాబా ఆలయంలో బుధవారం గ్రామోత్సవం నిర్వహించారు.
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. డీలర్లే అక్రమంగా బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తున్నారు. రేషన్ డిపోలో బియ్యం ఇవ్వకుండా డీలరే ఇళ్ల వద్దకు వెళ్లి వారికి కిలోకు రూ.10 చొప్పున లెక్కగట్టి డబ్బులు చేతిలో పెట్టి వేలిముద్రలు వేయించుకుంటున్నారు. గతంలో ఎండీఎంయూ వాహనాలు ఉన్న సమయంలో ఇంటి ముందుకే వచ్చి రేషన్ ఇచ్చేవారు. ఆ సమయంలో ఎక్కువమంది బియ్యం తీసుకునేవారు. అయితే ఆ వ్యవస్థను రద్దు చేయడంతో వివిధ సాకులు చూపుతూ డీలర్లు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడం ద్వారా డిపోల నుంచే రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించేస్తున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రిళ్లు రేషన్ బియ్యం అక్రమంగా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిపోతోంది.
గత వారం రోజులుగా జిల్లాలో పలు ప్రాంతాల్లో రేషన్ బియ్యం పట్టుబడుతోంది. రేషన్ మాఫియాలో వచ్చిన విబేధాల కారణంగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటుండటంతో రేషన్ బియ్యం దొరుకుతోంది. గుంటూరు నగరంలో ఆర్టీసీ కాలనీకి చెందిన మిల్లర్ ఈ దందాలో చురుగ్గా ఉన్నాడు. ఇతనికి అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉండటంతో అతనిపై కేసులు నమోదు కావడం లేదు.
● పాత గుంటూరు బుచ్చయ్య తోట రెండవ లైన్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను ఆదివారం పాత గుంటూరు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆటోలో 60 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
● మూడు రోజుల క్రితం గుంటూరు సంజీవయ్య నగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
● నాలుగురోజుల క్రితం దుగ్గిరాల నుంచి గుంటూరుకు తరలిస్తున్న మినీ లారీని స్వాధీనం చేసుకుని 85 రేషన్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువుకి చెందిన వారు ఈ రేషన్ మాఫియాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
● మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరులో ఉన్న రైస్ మిల్లుకు ఇప్పటం జనసేన పార్టీకి చెందిన నేత ఒకరు రేషన్ బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేస్తునట్లు ఆరోపణలు ఉన్నాయి.
● దుగ్గిరాల మండలంలో అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ, దుగ్గిరాలకు చెందిన మరో వ్యక్తి ఆధ్వర్యంలో రేషన్ మాఫియా నడుస్తుంది.
పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు, పొన్నూరు మండలాల నుంచి చుండూరులోని ఓ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల వట్టిచెరుకూరు మండలం నుంచి చుండూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోను నారాకోడూరు వద్ద అధికారులు పట్టుకున్నారు.
కొల్లూరు మండలం నుంచి వట్టిచెరుకూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యం ఆటోలను నారాకోడూరు వద్ద అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పొన్నూరు పట్టణం, మండలం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. పట్టణంలోని ఇటికంపాడు రోడ్డులో ఓ ఇంటిలో నిలువజేసిన సుమారు 40 బస్తాల రేషన్ బియ్యం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. మాచవరం గ్రామంలో ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.
3
న్యూస్‌రీల్
రేషన్ మాఫియా కేరాఫ్ చుండూరు
కూటమి నేతల కనుసన్నల్లోనే..
తూతూమంత్రంగా పోలీసు కేసులు భారీగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యం ఇంటికి వచ్చి డబ్బులిచ్చి మరీ వేలిముద్రలు
తీసుకుంటున్న డీలర్లు వాటాలలో గొడవలతో గత వారం రోజులుగా భారీగా పట్టుబడుతున్న బియ్యం

రోడ్డెక్కిన రేషన్

రోడ్డెక్కిన రేషన్

రోడ్డెక్కిన రేషన్

రోడ్డెక్కిన రేషన్

రోడ్డెక్కిన రేషన్

రోడ్డెక్కిన రేషన్