
సాగు చేయనీకుండా అడ్డుకుంటున్నారు
నగరంపాలెం: జనసేన పార్టీ నేత తమ పొలం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని కౌలు రైతు వాపోయాడు. షేర్ ట్రేడింగ్ మార్కెట్‌లో దాదాపు రూ.27 లక్షలు పొగోట్టుకున్నట్లు మరో బాధిత ఉపాధ్యాయురాలు వాపోయింది. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో బాధితులు పలు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
జనసేన నేత అడ్డంకులు సృష్టిస్తున్నాడు
ఇటీవల జొన్నలగడ్డ గ్రామ పరిధిలోని సుగాలికాలనీ సమీపాన రెండు ఎకరాల పొలం కౌలుగా తీసుకున్నాను. ఫైనాన్స్ కింద ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేస్తున్నా. అయితే పొలం సాగు చేసుకునే క్రమంలో జనసేన పార్టీకి చెందిన గ్రామ ఉప సర్పంచి అడ్డంకిగా మారాడు. ఈ క్రమంలో పొలానికి వెళ్లే దారిలో అడ్డగించడం, వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించడం చేస్తున్నాడు. గత మంగళవారం ట్రాక్టర్‌పై పొలం వెళ్తుండగా అడ్డగించి ధూషించాడు. తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడని, ఊరు వదిలి వెళ్లకపోతే సహించేదిలేదని బెదిరించాడు. ఉప సర్పంచిపై చర్యలు తీసుకుని, మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నా.
– కె.రామునాయక్, శ్రీనునాయక్, బాలునాయక్, సుగాలి తండా, జొన్నలగడ్డ గ్రామం, గుంటూరు రూరల్ మండలం.
జిల్లా ఎస్పీకి కౌలు రైతు ఫిర్యాదు పోలీసు పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు స్వీకరణ

సాగు చేయనీకుండా అడ్డుకుంటున్నారు