
శిక్షణ తీరు మారింది.
గత ఐదేళ్లలో చెస్‌లో శిక్షణ విధానం చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీ చెస్‌కు చాలా ఉపయోగపడుతుంది. సరదాగా చెస్ ఆడుదామనుకునే వారు దీన్లోకి రావద్దని చెబుతాను. నా వద్ద ప్రస్తుతం 40 మంది శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో కొందరు త్వరలోనే ఇంటర్నేషనల్ హోదా సాధిస్తారు. ఆ స్థాయిలో రాణించాలంటే రోజుకు కనీసం 6 గంటల సాధన చేయాలి. నేర్చుకునే దానికంటే నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుంది. నా శిక్షణ విధానం రిజల్ట్స్ కోసమే ఉంటుంది. దీని కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తాను. – రవీంద్ర రాజు చల్లా, ఫిడే ఇన్‌స్ట్రక్టర్, ఇంటర్నేషనల్ చెస్ కోచ్, జీనియస్ చెస్ అకాడమీ