
చాలా నేర్చుకోవాలి
ప్రస్తుతం నా వయస్సు 12 సంవత్సరాలు. నాకు 1459 ఫిడే రేటింగ్ ఉంది. ఇప్పటికే 10 నేషనల్స్‌లో పాల్గొన్నాను. 7వ తరగతి చదువుతున్నాను. చెస్‌పై ఎంతో మక్కువ. అందుకే నిత్యం రెండు మూడు గంటల సాధన చేస్తున్నాను. గ్రాండ్ మాస్టర్ అవ్వడమే లక్ష్యం. రానున్న కాలంలో మరిన్ని ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొంటాను. కోచ్‌తోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఈ క్రీడలో రాణించాలంటే సాధనతోపాటు ఇష్టం కూడా ఎంతో ఉండాలి. చెస్ కారణంగా నాకు చదువులోనూ మంచి ఏకాగ్రత లభిస్తుంది. సమయాన్ని ఎక్కువగా చెస్ మీదే గడపడం వలన సెల్ ఫోన్ చూడను. – కె.సాన్విక, గుంటూరు