
హైవేలో భారీగా మద్యం స్వాధీనం
ప్రత్తిపాడు: జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఆబ్కారీ స్పెషల్ టీంలు స్వాధీనం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల పదహారవ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో మురుగన్ హోటల్ వెనుక ఖాళీ ప్రదేశంలో అక్రమంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వ చేసి, విక్రయాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, ఎస్‌ఐ రెహమాన్, ఈఎస్‌టీఎఫ్ సీఐ నయనతార, ఎస్‌ఐ సత్యనారాయణ బృందాలు స్థానిక ఆబ్కారీ స్టేషను సీఐ అశోక్, ఎస్‌ఐ రవీంద్రబాబులతో కలిసి శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించాయి. దాడుల్లో వివిధ బ్రాండ్లుకు చెందిన 2,598 మద్యం సీసాలు, 246 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని సీజ్ చేసి ప్రత్తిపాడు ఎకై ్సజ్ స్టేషనుకు తరలించారు. ఈ మేరకు ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ల ప్రసాదరావుపై శనివారం కేసు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ అశోక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 7 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.