సిందూర్‌.. సెల్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

సిందూర్‌.. సెల్యూట్‌

May 8 2025 8:01 AM | Updated on May 8 2025 11:14 AM

సిందూ

సిందూర్‌.. సెల్యూట్‌

గుంటూరు మెడికల్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్‌ నారాయణ, జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు జూపూడి రంగరాజు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. భారత మాతాకి జై.. జై జవాన్‌, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న భారతీయులకు ఈ విజయం అంకితమని తెలిపారు. పాక్‌కు సరైన గుణపాఠం చెప్పారని, ఇప్పటికై నా కవ్వింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ మన దేశ సైనిక బలగాల దృఢసంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు జూపూడి రంగరాజు మాట్లాడుతూ సైన్యానికి మద్దతుగా భారత ప్రజలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఖబడ్దార్‌ పాకిస్థాన్‌

మంగళగిరి: పెహల్గామ్‌ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను వీరోచితంగా ధ్వంసం చేసిన సైన్యం శక్తి, సామర్థ్యాలకు దేశం గర్విస్తోందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ వైమానిక దాడిని స్వాగతించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైన్యానికి యావత్‌ దేశం అండగా నిలవాలని పిలుపునించారు. భారత్‌ మాతాకి జై..వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఆపరేషన్‌ సిందూర్‌పై హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఏబీపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పూర్ణిమ లక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సైన్యానికి మద్దతుగా సంఘీభావం

గుంటూరు మెడికల్‌: బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్‌ డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా ఆ పార్టీ నేతలు బుధవారం జాతీయ జెండాలతో సంఘీభావం తెలిపారు. స్థానిక నాజ్‌ సెంటర్‌లోని వాజపేయి విగ్రహం వద్ద భారత దేశ సైన్యానికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శనక్కాయల ఉమా శంకర్‌ మాట్లాడుతూ చర్యకి ప్రతి చర్య ఉంటుందని ప్రధాని మోదీ ముందే తెలిపారని, దానికి అనుగుణంగా ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టడానికి ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టారని వివరించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. గుంటూరులోని జిన్నా టవర్‌ సెంటర్‌ పేరును మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని కోరారు. భారతదేశంలో పాకిస్థాన్‌ పేర్లతో ఉన్న అన్నింటికీ భారతీయుల పేర్లు పెట్టాలని ప్రధానమంత్రిని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, మండల అధ్యక్షుడు మలిశెట్టి పవన్‌ కుమార్‌, మైనారిటీ మోర్చా నాయకులు ఖుద్దూస్‌, రఫీ, సురేష్‌ కుమార్‌ జైన్‌, బజరంగ్‌ రామకృష్ణ, నాగేశ్వరావు, మండల నాయకులు పాల్గొన్నారు.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై జిల్లా ప్రజల ఆగ్రహం

ఆపరేషన్‌ సిందూర్‌పై హర్షాతిరేకాలు

కులమతాలకు అతీతంగా

సైనికులకు వెన్నుదన్ను

పాక్‌కు గుణపాఠం చెప్పాలని నినాదాలు

సిందూర్‌.. సెల్యూట్‌1
1/2

సిందూర్‌.. సెల్యూట్‌

సిందూర్‌.. సెల్యూట్‌2
2/2

సిందూర్‌.. సెల్యూట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement