
ఫెయిల్ అయితే ఓటమి కాదు
పరీక్ష ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గెలుపోటములకు కుంగిపోవడం, మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం అంటే మనకి మనం ఓటమిని అంగీకరించటమే. ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది పెద్ద చదువులు చదివిన వారే లేరు. వారు చేసిందల్లా ఒకటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. మన సర్టిఫికెట్లు అర్హతగానే పరిగణించాలి. మార్కులు తక్కువ వచ్చాయనో, మనం కోరుకున్న కళాశాలలో సీటు దక్కలేదనో కుంగుబాటుకు గురవటం అనవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకున్న రోజు ప్రపంచంలో మనకన్నా గొప్పవారు ఎవరూ ఉండరు.
–నీలి ఉమాజ్యోతి (మానసిక వ్యాధుల, విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్)