బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి

May 21 2024 9:20 AM | Updated on May 21 2024 9:20 AM

బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి

బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగ డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ బోధనపై గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని ఉపాధ్యాయులకు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. గణిత, భౌతిక, రసాయనశాస్త్ర పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులకు జిల్లా పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి సూచనలు, సలహాలు ఇచ్చారు. సాంకేతిక బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని చెప్పారు. డీఈఓ పి.శైలజ మాట్లాడుతూ సీబీఎస్‌ఈ పాఠశాలల్లో పని చేస్తున్న ఇంగ్లిషు, సోషల్‌, బయాలజీ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఇటీవల రెండు రోజుల పాటు శిక్షణ విజయవంతంగా పూర్తిచేశామని చెప్పారు. ప్రస్తుతం గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలను బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో గుంటూరు డీవైఈఓ పి.వెంకటేశ్వరరావు, సీమ్యాట్‌ నుంచి వచ్చిన పరిశీలకురాలు ఎ.సుహాసిని, ఎంఈఓ పి.వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ షేక్‌ ఎండీ ఖాసిం, రిసోర్స్‌ పర్సన్లు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగ

డైరెక్టర్‌ కె.రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement