నిత్యాన్నదానానికి రూ.1.74 లక్షలు విరాళం | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.1.74 లక్షలు విరాళం

Published Thu, Nov 9 2023 1:30 AM

-

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ.1.74 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌ పటాన్‌చెరువు ప్రాంతానికి చెందిన ఆర్‌.అశోక్‌గౌడ్‌ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి ఈ మొత్తాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి మధు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement