ఇండో–పసిఫిక్‌ ప్రపంచ మథనం

G7 India and America meetings with South Pacific countries - Sakshi

విశ్లేషణ

ఈ నెల మనం వరుసగా కొన్ని ప్రపంచస్థాయి సదస్సులను చూడబోతున్నాం. జీ7; దక్షిణ పసిఫిక్‌ దేశాలతో భారత్, అమెరికా సమావేశాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలో కొత్త పొత్తులు, భౌగోళిక రాజకీయ పోటీ, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం పథకాల వంటివి చోటు చేసుకోనున్నాయి. జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్‌... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్‌ లతో; ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ (టీటీసీ) ద్వారా యూరోపియన్‌ యూనియన్‌ తో; బ్రిటన్, కెనడాలతో భారత్‌ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ అంత ర్జాతీయ కార్యకలాపాలు, విస్తృతార్థంలో అంత ర్జాతీయ వ్యవస్థ మారుతున్న స్వభావాన్ని పట్టి చూపే పలు నాయకుల సదస్సులకు ఈ నెల సాక్షీభూతం కానుంది. మొత్తంగా అవి కొంత కాలంగా వ్యక్తమవుతున్న కొన్ని ధోరణుల కలయికను సూచిస్తాయి. వాణిజ్య, ఆర్థిక పరస్పర ఆధారిత విధానాలు,  చైనా అంతర్జాతీయ పాత్ర, భారత్‌ అంతర్జాతీయ భాగస్వామ్యాల సాపేక్ష ప్రాధాన్యత, ప్రపంచ ప్రధాన రాజకీయ లోపాలు వంటివన్నీ నిర్మాణాత్మక మార్పులకు లోనయ్యాయి.

అయితే, ఈ పరిణామాలు నిర్దిష్ట వ్యాఖ్యాతలతో పొసగడం లేదు. అవేమిటంటే, తప్పుడు సమానత్వా లకు అతుక్కు పోతున్న భారతీయులు. న్యూఢిల్లీతో సంబంధాలను క్రమం తప్పకుండా చిన్నచూపు చూస్తున్న అమెరికన్లు, బ్రస్సెల్స్,సింగపూర్, న్యూయార్క్‌ వంటి ప్రాంతాల్లోని వ్యక్తులు లేదా సంస్థలు గత ఆర్థిక, రాజకీయ క్రమాన్ని తిరిగి పొందాలని కోరుకోవడం వంటివి.

ఈ వారం హిరోషిమాలో జరగనున్న జి7 దేశాల సమావేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు చెందిన నాయకులు సమావేశం కానున్నారు. 1970ల నుంచి వీరు వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతూ వస్తున్నారు. జి7 అజెండాలో, నేటికీ కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం ప్రధానాంశంగా ఉంటుంది, ఈ గ్రూప్‌ దేశాలు రష్యాపై ఆంక్షలతోపాటు ఉక్రెయిన్‌ ప్రభుత్వం వెనుక నిలబడటం తెలిసిందే.

అయితే అమెరికా, కెనడాలను మినహాయిస్తే తక్కిన దేశాలు సాపేక్ష ఆర్థిక పతనం దశలో ఉంటున్నాయి. అమెరికా యేతర జి–7 సభ్యదేశాల సామూహిక స్థూల దేశీయోత్పత్తి 1992లో ఉన్న 52 శాతం నుంచి నేటికి 23 శాతానికి పడిపోయింది. ఒక ఉమ్మడి శక్తిగా, జీ7 ఐక్యత ఈరోజు మరింత విలువైనదైనా, వాటి బలం తక్కువగా ఉంటోంది.

జీ7 సభ్యదేశాలన్నింటితో సహకారం పెరుగుతున్న సమయంలో, 2019 నుంచి అతిథిగా హాజరవుతున్న భారత్‌... తాజాగా జీ7 దేశాల సదస్సులో పాల్గొననుంది. క్వాడ్‌లో అమెరికా, జపాన్‌ తో, ట్రేడ్‌ అండ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ (టీటీసీ) ద్వారా యూరోపియన్‌ యూనియన్‌ తో, బ్రిటన్, కెనడాలతో భారత్‌ ముందస్తు వాణిజ్య చర్చలు జరుపుతోంది. సంక్లిష్టభరితమైన జనాభా, స్థూల ఆర్థికపరమైన సంధికాలంలో భారత అభివృద్ధిని, ఆర్థిక భద్రతా లక్ష్యాలను వేగవంతం చేయడం కోసం ఈ యంత్రాంగాలను ప్రభావితం చేయడం ప్రధానమైన అంశంగానే ఉంటుంది.

అదే సమయంలో ఉక్రెయిన్‌ యుద్ధం, భారత్‌ జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలోనూ, అభివృద్ధి చెందిన ప్రపంచం నుంచి స్పల్ప మార్పులనే గమనిస్తున్న భారత్‌కు జాతీయ, అంతర్జాతీయ సమస్య లను లేవనెత్తే అవకాశాన్ని జీ7 సదస్సు కల్పిస్తోంది. ఈ సమస్యలు ఏమిటంటే, ఇంధన, ఆహార భద్రత; సరఫరా మార్గాల స్థితిస్థాపకత, వాతావరణం; ఆర్థిక, స్వావలంబన అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ, రుణ స్థిరత్వం వంటివి. కాగా, అమెరికా వడ్డీరేట్లు అధికంగా ఉడటం, డిజిటల్‌ కరెన్సీలు, చెల్లింపుల్లో ఆవిష్కరణలు, నిలకడ  లేని వాణిజ్య అసమతుల్యతలు, అంతర్జాతీయ ఆంక్షలు వంటివి రానున్న సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక  వ్యవస్థను చుట్టుముట్ట నున్నాయి.

హిరోషిమా సదస్సును దాటి చూస్తే, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లు దక్షిణ పసిఫిక్‌ దేశాల నాయకులతో సమావేశాల కోసం పాపువా న్యూ గినియాను సంద ర్శిస్తారని భావిస్తున్నారు. వాటి చిన్న సైజు, చిన్నచిన్న దీవుల్లోని జనాభా కారణంగా దక్షిణ పసిఫిక్‌ ప్రాంతాన్ని తరచుగా చిన్నచూపు చూస్తూ వచ్చారు.

కానీ ప్రపంచ భూ ఉపరితలంలో ఈ ప్రాంతం ఆరింట ఒక వంతును కలిగి ఉంది. తైవాన్‌ , అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలపై ప్రభావం చూపే విషయంలో చైనా పోటీ పడటాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రాంతం కూడా భౌగోళిక రాజకీయ హాట్‌ స్పాట్‌గా మారుతోంది. పైగా వాతావరణ సంక్షోభం, నిలకడైన రుణ విధానాలు, మత్స్య, ఖనిజ వనరులు వంటివాటికి ఈ ప్రాంతం కీలకమైనది.

భారత్‌ విషయానికి వస్తే, ఫోరమ్‌ ఆన్‌ ఇండియా పసిఫిక్‌ ఐలాండ్‌ కో–ఆపరేషన్‌ (ఎఫ్‌ఐపీఐసీ) ద్వారా 2014–2017లో ప్రారంభమైన మహమ్మారి సంబంధిత విరామం – వ్యాప్తి తర్వాత పోర్ట్‌ మోర్స్‌బీలో జరుగనున్న సదస్సు ఒక సహజమైన కొనసాగింపు. ఈ సంవత్సరాల్లో భారత ప్రధాని ఫిజీలో 14 దక్షిణ పసిఫిక్‌ ప్రాంత నాయకులను కలిశారు. వారందరికీ జైపూర్‌లో ఆతిథ్యమిచ్చారు. భారతీయ అభివృద్ధి, సహాయ పథకాలను ప్రదర్శించడానికి అది ఒక అవకాశం అవుతుంది.

ఫిజీ, పాపువా న్యూ గినియాలలో రుజువైనట్లే, గ్లోబల్‌ సౌత్‌ని ప్రభావితం చేస్తున్న కొన్ని ఉమ్మడి సవాళ్లకు  ప్రస్తుత భారతీయ ప్రతిపాదనలు పరిష్కారాలు కావచ్చు. అదే సమయంలో, అమెరికా భూభాగం కాని ఒక దక్షిణ పసిఫిక్‌ దేశానికి బైడెన్‌  ప్రయాణం ఆశ్చర్యకరంగా అమెరికా అధ్యక్షుడి ప్రథమ సందర్శన కానుంది. పైగా, ఒక ముఖ్యమైన ప్రాంతంపై వాషింగ్టన్‌ చాలాకాలం తర్వాత దృష్టి పెట్టినట్లవుతుంది. 

చివరగా, ఆస్ట్రేలియాలో క్వాడ్‌ సదస్సుకు ఈ నెల సాక్షీభూతం కానుంది. గ్రూప్‌ లీడర్లు మూడోసారి వ్యక్తిగతంగా కలవనున్నారు. అమెరికా అధ్యక్షుడు వార్షిక ప్రాతిపదికన హాజరయ్యే కొన్ని అంత  ర్జాతీయ గ్రూప్‌ సమావేశాలు ఏవంటే, జీ7, జీ20, నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో) ఆసియా పసిఫిక్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్, ఈస్ట్‌ ఆసియా సదస్సు, ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు. ఈ చిన్న జాబితాలో క్వాడ్‌ కొత్త చేరిక అన్నమాట. 

2021లో అధ్యక్ష స్థాయి సమావేశంగా మొదటిసారి ఉనికిలోకి వచ్చిన క్వాడ్, మూడు కార్యాచరణ బృందాలను ఏర్పర్చింది. కానీ ఇప్పుడు దీని కార్యకలాపాలు 25 కార్యాచరణ బృందాలకు విస్తరించాయి. వీటిలో కొన్ని, క్వాడ్‌ ఫెలోషిప్స్‌ వంటి కొన్ని ఫలితాలను ఇప్పటికే ప్రదర్శించాయి. మరి కొన్ని సముద్రజలాల సమస్యలు, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ రుణం వంటి అంశాల్లో సన్నిహిత సహకారానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

కొన్ని కార్యాచరణ బృందాలు ఇప్పటికీ చాలా అస్థిరంగా ఉంటున్నాయి. ఇకపోతే సరఫరా చైన్లు, సంక్లిష్ట టెక్నాలజీలు వంటి ఇతర అంశాల్లో సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడానికి క్వాడ్‌ ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చింది. వీటిలో అమెరికా, భారత్‌లతో ముడి పడి ఉన్న జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని టెక్నాలజీ సంభాషణ, ఐసీఈటీ వంటివి ఉన్నాయి లేదా, ఇండో–పసిఫిక్‌ ఎకన మిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఐపీఈపీ), మారిటైమ్‌ డొమైన్‌ అవేర్‌నెస్‌ (టిపి– ఎమ్‌డిఎ) వంటి అంశాలపై దేశాల విస్తృత సమితిని తీసు కొచ్చాయి.

ఇవి, మరికొన్ని ప్రయత్నాలు సిడ్నీలో జరగనున్న సదస్సు నాటికి కొంత ప్రగతిని చవి చూస్తాయి కూడా. (అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల వల్ల జో బైడెన్‌ ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవ డంతో క్వాడ్‌ సమావేశం ఆఖరు నిమిషంలో వాయిదా పడింది).

ఇక ఈ నెలలో జరగనున్న ఇండో–పసిఫిక్‌ అత్యున్నత సమావేశం సారాంశాన్ని చూస్తే, అంతర్జాతీయ వ్యవస్థలో కొన్ని కీలకమైన ప్రకంపనలను అవి ఎత్తిచూపనున్నాయి. ఈ ధోరణులను అభినందించే విషయంలో అనేక ప్రముఖ అంతర్జాతీయ వ్యాఖ్యాతలు ఘర్షించ వచ్చు. కానీ ఆర్థిక సంబంధాల నూతన పోకడలు, కొత్త రంగాలు, భౌగోళిక–రాజకీయ పోటీ రూపాలు, ఈ సమస్యలను ఎదుర్కోవడా నికి కొత్త యంత్రాంగాలు సీదాసాదాగా రూపుదిద్దుకుంటున్నాయి.

ధ్రువ జైశంకర్‌ 
వ్యాసకర్త కార్యనిర్వాహక డైరెక్టర్, ఓఆర్‌ఎఫ్, అమెరికా
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్’ సౌజన్యంతో...)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top