Health Tips: కొత్తిమీరతో ప్రయోజనాలు ఎన్నో... | You Must Know These Multiple Health Benefits Of Coriander | Sakshi
Sakshi News home page

Health Tips: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇది తరచుగా తింటే సరి!

Sep 23 2021 10:28 AM | Updated on Sep 23 2021 8:01 PM

You Must Know These Multiple Health Benefits Of Coriander  - Sakshi

కొత్తిమీర ప్రయోజనాలెన్నో..  గుండె సంబంధ సమస్యలు, హార్ట్‌ స్ట్రోక్‌ల నివారణకు, ఇన్సులిన్‌ ఉత్పత్తికి ఇది భేష్‌! ఇంకా..

అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారాల్లో కొత్తిమీర ఒకటి. కొత్తిమీరలో ఉండే ఎన్నో ఔషద గుణాలు అనేక ఆరోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుందని మీకు తెలుసా..! అవేంటో తెలుసుకుందాం..

►కొత్తిమీరను వివిధ రకాల కూరలు, లేదా చట్నీ చేసుకుని తింటే మంచి రుచితోపాటు, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు విటమిన్‌ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియమ్‌లు శరీరానికి అందుతాయి. 

►లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్‌ యాసిడ్స్‌ కొత్తిమీరలో ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలు, హార్ట్‌ స్ట్రోక్‌ల ముప్పుని తగ్గిస్తాయి. డైలీ కొత్తిమీర తినడం వల్ల రక్తప్రరణ బాగా జరుగుతుంది. 

►దీనిలోని యాంటీ బయోటిక్‌ మూలకాలు రక్తంలోని సుగర్‌ స్థాయులను తగ్గించి ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. అందువల్ల కొత్తిమీర జ్యూస్‌ను పరగడుపున తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 

►లినోలాల్‌ అనే మూలకం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషించి, జీర్ణసమస్యలను దరిచేరనివ్వదు. అంతేగాక యాంటీ పాస్మోడిక్‌ గుణాల వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది.


 
►కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి  ఖాళీకడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. 

►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది.

చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్‌ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement