Reason Why Ice Cream Tastes So Good? - Sakshi
Sakshi News home page

Ice Cream: ఐస్ క్రీమ్ తింటున్న కొద్దీ ఇంకా తినాలని ఎందుకు అనిపిస్తుంది?

Published Wed, Jun 14 2023 12:49 PM

Why Do You Want Ice Cream And Tast So Good - Sakshi

ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదించే మధురమైన స్నాక్‌. ఆఖరికి పెళ్లి భోజనాల్లో తాంబులాలకు బదులు ఐస్‌క్రీంలు సర్వ్‌ చేస్తున్నారు. అంతలా మిగతా తినుబండరాల్లో రారాజుగా అగ్రస్థానంలో నిలిచింది. ఐస్‌క్రీ వినియోగం విషయమై పోటీపెడితే ప్రతి దేశం పాల్గొంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐతే ఐస్‌క్రీం మనల్ని ఎందుకంతలా టెంప్ట్‌ చేసి..తినేకొద్ది తినాలనిపిస్తుందంటే..

తొలి నాళ్లల్లో కేవలం పాలు చక్కెరతో తయారు చేసిన ఐసీక్రీ మాత్రమే ఉండేది. ఆ తర్వాత వెన్నెలా అంటూ రకరకాల ఐస్‌క్రీం ఫ్లేవర్‌లు లెక్కకు మించి మార్కెట్లోకి వచ్చి మనల్ని ఊరించడం ప్రారంభించాయి. అయితే వీటి తయారికి పాలు, చక్కెర ప్రధానమైనవి. ఆ తర్వాత సాల్ట్‌, స్ట్రాస్‌ పియర్‌, బ్లూ చీజ్‌లు ఈ ఐస్‌క్రీంకి మరింత రుచిని తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. ఓన్లీ క్రిమ్‌ని సిప్‌ చేయకుండా మధ్య, మధ్యలో క్రంచీ క్రంచీగా తినేలా మాల్టెడ్‌ మిల్స్‌బాల్స్‌ వచ్చాయి. ఈ క్రమంలోనే క్యాండీడీ సాల్మన్‌తో కూడిన ఐస్‌క్రీంలు, క్రీమీ సలాడ్‌ డ్రెస్సింగ్‌లో ఇల్లులాంటి ఆకృతులతో కూడిని ఐస్‌క్రీంలు వచ్చాయి.

మొదటగా ఆ ఐస్‌క్రీంని చూడగానే రంగు, రుచి, ఆకృతులతో కట్టిపేడేయాలన్న లక్ష్యంతో తయారీదారులు వాటికే ప్రాధాన్యత.. ఇస్తూ మంచి నాణ్యతతోక కూడినవి ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఐసీక్రీంలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ సమ్మర్‌ సీజన్‌లో అయితే ఇక ఆ ఐస్‌క్రీంలను అస్సలు వదిలిపెట్టరు. ఇదే క్రమంలో ఫుడ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌లు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి. మసోని ఉబెర్‌ గౌర్మెట్‌ అనే మహిళా ఫుడ్‌ ఇన్నోవేటర్‌ ఇప్పటి వరకు తన కెరియర్‌లో సుమారు 100 రకాల విభిన్న ఫ్లేవర్‌లతో కూడిన ఐస్‌క్రీంలను తయారు చేసింది.

సరికొత్త బ్రాండ్‌లతో మరింత రుచిగా అందించేలా నెపుణ్యాలను మెరుగుపరచుకోవడమే గాక మనం తీసుకునే ఆహారంలో ఇన్‌ బ్యాలెన్స్‌ అయ్యేలా వాటిని రూపొందిస్తుంది ఉబెర్‌. అంతేగాదు ఆరోగ్యానికి ప్రమాదకారికి ఉండకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడూ నాణ్యతతో కూడిన సరికొత్త ఐస్‌క్రీంలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు తయారీదారులో. దానిలో ఉండే చక్కెర గడ్డ కట్టకుండా ఉంటూ మన హయిగా ఆస్వాదించేలా ఉంటున్నాయి. ప్రజల ఆరోగ్య రీత్యా చక్కెరను కూడా తక్కువ శాతం వినియోగించేందుకు కంపెనీలు ఆసక్తి కనబర్చడంతో.. ప్రజలు కూడా వాటిని తినేందుకేక ఇష్టపడుతున్నారు.

చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీంని ఆస్వాదించగానే మన మెమెరీ ఒక్కసారిగా ఉత్తేజంగా మారడమే గాక మనం ఆనందంగా ఉన్న జ్ఞాపకాలు కళ్లముందు మెదిలేలా చేస్తుంది. దీంతో మనకే తెయని ఒక విధమైన అనుభూతికి గురై..మరోసారి తినాలనే ఫీలింగ్‌ వస్తుంటుంది. ఇక వీటిలో అధిక కొవ్వు, చక్కెరల కారణంగా రోజు ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందువల్ల సాధ్యమైనంత మేర కాస్త దూరంగా ఉండటమే మంచిది అంటున్నారు ఆహార నిపుణులు. ఆయా ఐస్‌క్రీంలలో ఎలక్రిక్‌ మిషన్‌తో కూడిన స్కూపీల్లో చక్కెర స్థాయిలు, కొవ్వు శాతం సుమారు 10 నుంచి 11 శాతం  మాత్రమే ఉంటాయి. ఇక మంచి బ్రాండెడ్‌ కంపెనీలకు సంబంధించిన ఐస్‌క్రీంలలో అయితే వాటి స్థాయి అధికంగానే ఉంటుంది. 

(చదవండి: కమ్మని కాఫీలాంటి కళ)

Advertisement
Advertisement