ఓ వ్యక్తి ఆహార్యంలో హుందాతనం, స్టైలిష్‌ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసే వాటిలో కురులది ప్రధాన పాత్ర. ఆ హెయిర్‌స్టైలే పెద్ద మనిషిలా హుందాగా చూపించడం, అలాగే పాతికేళ్ల కుర్రాడి లుక్ చూపించడంలోనూ కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ చాలా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అయిన హెయిర్‌స్టైల్స్ యువతను ఎంతలా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగానే తన ఆహార్యం మొత్తం మార్చుకుని ఓ పెద్ద తరహా లుక్‌తో కనిపించే హెయిర్‌స్టైల్‌తో ముందుకొచ్చి ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇంతలా హీరో దళపతిని అందంగా హెయిర్‌ని స్టైల్ చేసి చూపించే వ్యక్తి ఎవరంటే..
తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టిపెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి చర్రిత సృష్టించారు దళపతి విజయ. హీరోగా మొదలై..ఓ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కూడా. నటనలోనూ నాయకుడిగా తనదైన మార్కుని చూపిస్తూ..ప్రజలకు మంచి పాలన అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఒక నాయకుడిగా పెద్దతరహాలో కనిపించే ఆయన ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించేది హెయిర్. అంత అందంగా ఆయన హెయిర్‌ని తీర్చిదిద్దే వ్యక్తి జగదీష్ అవస్థి.
30 ఏళ్ల ఈ హెయిర్ స్టైలిస్ట్ దళపతి అభిమానులను అలరించేలా రకరకాల హెయిర్‌ని తీర్చిదిద్దడంలో దిట్ట. బిగిల్' సినిమా నుంచి 'లియో', 'గోట్ (GOAT)' వరకు విజయ్‌కి హెయిర్ స్టైలింగ్‌గా వ్యవహరిస్తున్నాడు. జగదీస్ విజయ్‌తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ను సీఎంగా చూడటం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తనకు పదోతరగతి నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది.
ఆ నేపథ్యంలోనే సెలూన్‌కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి, ఒక సెలూన్‌లో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన హెయిర్‌స్టైలిస్ట్‌ల ద్వారా విజయ్ బిగిల్ మూవీ కొత్త హెయిర్‌స్టైల్ కోరుకుంటున్నారని తెలిసింది. అలా ఆయన్ను తనకు కలిసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతీ మూవీకి తనే హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జననాయగన్‌కు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపాడు. విజయ్ హెయిర్‌స్టైల్‌లో బాగా పాపులర్ అయ్యింది 'బీస్ట్' స్టార్ హెయిర్‌స్టైల్. అయితే హీరో విజయ్‌ది సహజంగా ఒత్తుగా హెల్దీగా ఉండే జుట్టు కావడంతో ఈ హెయిర్‌స్టైల్ బాగా నప్పిందని చెప్పుకొచ్చాడు.
అదీగాక సులభంగా రకరకాల హెయిర్‌స్టైల్‌లోకి మార్చగలమని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రతి మూవీలోని ఆయన పాత్రకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆయన జుట్టుకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు బాగా చేశావ్ అబ్బాయ్ అని ప్రశంసించన క్షణం ఇప్పటికీ మరువలేను అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఇక 2023లో లియో జుట్టుతో చేసిన వైరల్ లుక్ గురించి మాట్లాడుతూ..ఆ లుక్‌ల సాల్ట్-అండ్-పెప్పర్ (ఉప్పు-మిరియాల) జుట్టు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. అయితే ఈ స్టైల్‌లో నుదుటిపై జుట్టు పడే స్టైల్ మాత్రం ఆయన ఆలోచననే అని క్రెడిట్ మొత్తం హీరో విజయ్‌కే ఇచ్చాడు. అంతేగాదు ఆయ హెయిర్‌ని సరిచేస్తున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉంటారని అన్నాడు. అలాగే సెట్‌లో ప్రతిఒక్కర్ని శ్రద్ధగా చూసుకుంటారని, అందరితోటి చాలా సౌమ్యంగా మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. చివరగా యవతరం హెయిర్‌స్టైలిస్ట్‌లకు చక్కటి చిట్కాలే కూడా సూచించాడు
కేవలం హెయిర్‌స్టైల్స్ మాత్రమే నేర్చుకోకండి , మనుషులను అర్థం చేసుకోవడం, వారి వ్యక్తిత్వం, కెమెరా కోణాలు, ఫ్యాషన్ ఉనికిని క్యాచ్ చేయడం వంటి వాటిపై పట్టు తెచ్చుకుంటేనే మన నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతీ సీజన్‌లో ట్రెండ్‌లు మారుతుంటాయి కానీ మీ ప్రత్యేకత, వృత్తి నైపుణ్యమే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టేలా పేరుని తెచ్చుపెడుతుందని అన్నాడు.
(చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్‌గా విదేశీ మహిళ పోస్ట్)


