ప్రపోజ్‌ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే!

Valentine Week: Ways To Express Love And Gift Ideas On Propose Day - Sakshi

ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్‌ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్‌ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్‌ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్‌ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్‌..! 

ఎలా ప్రపోజ్‌ చేస్తారో తెలుసుకుందాం.. 
ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్‌ ఇస్తే ఇంప్రెస్‌ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం  గ్రీటింగ్‌ కార్డులు, చాక్లెట్‌లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్‌ప్రైజ్‌ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. 

ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్‌ కప్‌ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు.

సాహసాలకు సిద్ధపడతారు..
మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్‌ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్‌ మై లవ్‌ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్‌ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top