Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్‌ లడ్డు

Udupi Special And Simple Recipes For Nursing Mothers - Sakshi

అదేమిటో కానీ, మన ఇంటి వంట కంటే పక్కింటి పోపుకే ఘుమఘుమలు ఎక్కువ. మన పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రం ఉడిపి వాళ్ల ఆరోగ్యవంటలకు మన వంటింట్లో పోపు వేద్దాం. పాలిచ్చే తల్లి ఏమి తినాలో ఉడిపి వాళ్ల మెనూ చూద్దాం. 

సొప్పు పాల్య 
కావలసినవి: 
►పాలకూర – 2 కట్టలు
►ఉల్లిపాయ– 1 (తరగాలి)
►ఉప్పు – అర టీ స్పూన్‌

►మిరియాల పొడి– టీ స్పూన్‌.
►పోపు కోసం: నెయ్యి– 2 టీ స్పూన్‌లు
►జీలకర్ర – అర టీ స్పూన్‌
►కరివేపాకు– 2 రెమ్మలు.

తయారీ:
►పాలకూరను శుభ్రం చేసి తరగాలి. 
►బాణలిలో నెయ్యి వేడి చేసి జీలకర్ర వేయాలి.
►అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

►ఆ తర్వాత కరివేపాకు వేయాలి. 
►ఇప్పుడు పాలకూర, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి మూత పెట్టి సన్న మంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి (ఆకులోని నీటితోనే మగ్గుతుంది).
►దీనిని పాలిచ్చే తల్లికి రెండు రోజులకొకసారి పెడతారు. 

మోహన్‌ లడ్డు
కావలసినవి:
►గోధుమ పిండి– కప్పు
►బియ్యప్పిండి– టేబుల్‌ స్పూన్‌
►నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్‌లు
►చక్కెర– కప్పు
►నీరు – అర కప్పు

►యాలకుల పొడి– అర టీ స్పూన్‌
►జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌లు
►కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌
►నూనె – పూరీలు కాలడానికి తగినంత.

తయారీ:
►వెడల్పు పాత్రలో గోధుమపిండి, బియ్యప్పిండి, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి, నీటిని పోస్తూ ముద్దగా కలపాలి.
►బాణలిలో నూనె వేడి చేసి ఈ పిండినంతటినీ పూరీలు చేసుకోవాలి.
►మోహన్‌ లడ్డు కోసం చేసే ఈ పూరీలు మెత్తగా ఉండకూడదు, కరకరలాడాలి.

►చల్లారిన తరవాత వీటిని తుంచి చిన్న ముక్కలు చేయాలి.
►బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పూరీ ముక్కల్లో కలపాలి.
►ఒక పాత్రలో చక్కెర వేసి, నీరు పోయాలి. చక్కెర కరిగిన తరవాత, యాలకుల పొడి వేసి మీడియం మంట మీద సిరప్‌ తయారయ్యే వరకు మరిగించాలి.
►ఈ చక్కెర పాకాన్ని పూరీ ముక్కల మీద పోస్తూ లడ్డు చేయాలి. ఇది ఉడిపి స్పెషల్‌.

చదవండి: Menopause: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్‌ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
Facial Brush: మృత కణాలు, దుమ్ము, ధూళి మాయం.. ఈ డివైజ్‌ ధర ఎంతంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top