
ఇరానీ చాయ్, కబాబ్‌లు, బిర్యానీలకు సిటీ ప్రసిద్ధి చెంది ఉండవచ్చు.. కానీ ఇప్పుడు ఖరీదైన రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. తమ దగ్గర ఉన్న విలాస విందు గురించి రెస్టారెంట్స్, తాము రుచిచేసిన కాస్ట్‌లీ ఫుడ్ గురించి నగరవాసులు సోషల్ వేదికలపై పంచుకుంటూ రిచ్ రుచుల వెల్లువకు కారణమవుతున్నారు. ఫలితంగా బంగారంతో చుట్టిన ఇడ్లీలు, రాజకుటుంబానికి సరిపోయేంత పెద్ద పళ్లెంలో విందులకు కూడా నగరం పేరొందుతోంది. అనేక మందికి ఇదో ఖరీదైన రుచికరమైన యాత్ర. ఈ వంటకాలు కేవలం భోజనం మాత్రమే కాదు, అవి జ్ఞాపకాల్లో ఒదిగిపోయే అనుభవాలు కూడా అంటున్నారు ఫుడ్ లవర్స్.
ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి తినడం.. ఇప్పుడు అభిరుచులు నెరవేర్చుకోవడానికి తినడం దాకా పరిణామం చెందింది. ఆకలికి హద్దు ఉంటుందేమో కానీ అభిరుచులకు ఉండదు కదా.. అలాగే ఇప్పుడు ఆహార అభిరుచులు కూడా కొత్త పుంతలు కాస్ట్‌లీ వింతలుగా మారుతున్నాయి. ఈ సోషల్ మీడియా యుగంలో తినడం మాత్రమే కాదు ఆనందించడం.. ఆ ఆనందాన్ని నలుగురితో
పంచుకోవడం కూడా అలవాటైంది.
ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలంటే ఇరానీ చాయ్ సరిపోదు.. ఇడ్లీ రూ.1200 ఉండాల్సిందే అనేది సిటీ సోషల్‘ఇçషు్టల’ మాట బాట. అలాంటి వారి కోసం నగరంలోని పలు రెస్టారెంట్స్, కేఫ్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్.. వైవిధ్య భరితంగా అదే సమయంలో అత్యంత విలాసవంతమైన రుచులను అందిస్తున్నాయి. అలాంటి కాస్ట్‌లీ వంటకాల్లో కొన్నింటి విశేషాలు..
బంజారాహిల్స్‌లోని లెవాంట్ రెస్టారెంట్‌లో ఉన్న మషావి ముషాకల్ ప్లేట్ ధర: రూ.3,300.. నగరంలో ఫైవ్‌స్టార్ హోటల్స్‌ను మినహాయిస్తే.. రెస్టారెంట్స్‌లోని ఖరీదైన ప్లేట్ ఇదే. దీనిలో వడ్డించే మిడిల్ ఈస్టర్న్ విందు మాంసం ప్రియులను చవులూరిస్తుంది. బాషా షీష్, అదానా కబాబ్, లాంబ్ చుకాఫ్, బాల్కా షీష్, లెవాంట్ జాయేనా.. గ్రిల్ చేసి స్టైల్‌గా వడ్డిస్తారు. ఇది రోజంతా తినాల్సిన భోజనాన్ని సులభంగా భర్తీ చేయగలదు.
ఐటీసీ కోహినూర్‌లో అందించే హైదరాబాదీ బిర్యానీ దమ్ పుఖ్త్ బేగం ధర రూ.2500. ప్రీమియం కుంకుమ పువ్వు, సువాసనగల బాస్మతి బియ్యం లేత మాంసంతో మేళవించి వండుతారు. ఈ బిర్యానీ ఒక హ్యాండిలో అందంగా కనిపిస్తుంది.
బంజారాహిల్స్ లోని కృష్ణ ఇడ్లీని 24–క్యారెట్ గోల్డ్ ఇడ్లీగా పేర్కొంటారు. ఈ ఇడ్లీ ప్లేట్ ధర: రూ.1200 ఇది దక్షిణ భారతదేశంలోని పేరొందిన అల్పాహారం.. రెండు మృదువైన ఇడ్లీలు తినదగిన బంగారు
ఆకులతో కప్పబడి, గులాబీ రేకులను చల్లి, సాంబార్ చట్నీలతో వడ్డిస్తారు. బహుశా ఇడ్లీని ఇంత అందంగా ఎప్పుడూ చూసి ఉండరు.
బంజారాహిల్స్, హిమాయత్‌నగర్‌లలోని హుబెర్ – హోలీ అందించే మైటీ మిడాస్ గోల్డ్ ఐస్ క్రీం ధర: రూ.1200. ఇది కేవలం డెజర్ట్ కాదు, ట్రెజర్ అని చెప్పొచ్చు.
బెల్జియన్ చాక్లెట్, ప్రాలైన్ బాదం, మాకరూన్లు, చాక్లెట్ నిండిన బాల్స్. 24 క్యారెట్ తినదగిన బంగారు ఆకులో చుట్టబడిన చాక్లెట్ బార్‌తో తయారైంది. ఇది ఆర్డర్ ఇచ్చాక స్వీకరించడానికి గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది.
బంజారాహిల్స్‌లోని రోస్ట్ సిసిఎక్స్‌లో యానిమేటెడ్ చాక్లెట్ అందుబాటులో ఉంది. దీని ధర: రూ.1800 ప్లస్ పన్నులు అదనం. ఈ షోటాపర్ డెజర్ట్, అందమైన జంతువులు లేదా కార్టూన్ పాత్రలుగా మలిచారు. నగరంలోని అత్యంత అందమైన అత్యంత ప్రీమియం డెజర్ట్‌లలో ఒకటిగా పేరొందింది.
నగరంలోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, ది వెస్టిన్‌లోని ప్రీగో అత్యంత ఖరీదైన బిర్యానీలను అందిస్తాయని సమాచారం. ధరలపై స్పష్టత లేనప్పటికీ అక్కడ బిర్యానీల ధర రూ.6వేల వరకూ ఉంటుందని తెలుస్తోంది
బంజారాహిల్స్‌లోని హౌస్ ఆఫ్ దోసె, నగరంలోనే అత్యంత ఖరీదైన దోసెను అందుబాటులోకి తెచి్చంది. దీని ధర సుమారు రూ.1000 పైనే ఉంది. అయితే ఇది ఆర్డర్‌పై మాత్రమే అందిస్తారు. దీని తయారీలో తినదగిన బంగారు పూత, వేయించిన జీడిపప్పు, బాదం, స్వచ్ఛమైన నెయ్యి చట్నీలు లభ్యత: కస్టమర్ ఆర్డర్ చేసిన తర్వాత మాత్రమే తయారు చేస్తారు. గింజలు నెయ్యితో వస్తుంది. ఈ బంగారు దోసె ఆహార ప్రియులకు, వారాంతాల్లో ఆకర్షణగా మారింది.
(చదవండి: ప్లాంట్స్.. దోమలకు చెక్..!)