వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! | Sakshi
Sakshi News home page

Recipe: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి!

Published Fri, Feb 24 2023 6:31 PM

Tasty Vankaya Bonda Easy Recipe In Telugu - Sakshi

సాయంకాలం వేళ భిన్న రుచులు ఆస్వాదించాలనుకునే వాళ్లు ఇలా వంకాయ బోండా ట్రై చేసి చూడండి!
వంకాయ బోండా తయారీకి కావలసినవి:
►వంకాయలు – 10 (కాడలు తీయకుండా గుత్తివంకాయల్లా కట్‌ చేసుకుని, నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి)
►ఉల్లిపాయ – 1(ముక్కలు కట్‌ చేసుకోవాలి)
►నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు
►జీలకర్ర – అర టీ స్పూన్

►నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు
►కారం – 1 టీ స్పూన్
►ఉప్పు – తగినంత
►శనగపిండి – 1 కప్పు
►బియ్యప్పిండి – పావు కప్పు

►వాము – అర టీ స్పూన్
►పసుపు – చిటికెడు
►తినే సోడా – కొద్దిగా
►నీళ్లు – సరిపడా
►నూనె – డీప్‌ ఫ్రైకి చాలినంత

తయారీ:
►ముందుగా నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
►నిమ్మరసం, అర టీ స్పూన్‌ కారం, కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి.
►అనంతరం ఒక బౌల్‌ తీసుకుని అందులో.. శనగపిండి, బియ్యప్పిండి, వాము(చేత్తో నలపాలి), పసుపు, అర టీ స్పూన్‌ కారం, తినే సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలియతిప్పాలి.
►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి.
►ఇప్పుడు చల్లారిన వంకాయల్లో ఉల్లిపాయ మిశ్రమం పెట్టుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో బాగా ముంచి.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
►వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, టొమాటో కచప్‌ వంటివి జోడించి తింటే భలే రుచిగా ఉంటాయి ఈ బోండాలు.

ఇవి కూడా ట్రై చేయండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్‌ లడ్డు
Potato Popcorn Recipe: పొటాటో పాప్‌కార్న్‌ ట్రై చేయండిలా!

Advertisement
 
Advertisement