సమ్మర్‌లో హైడ్రేషన్‌ కోసం..! | Summer Health tips: Is There A Wrong Way To Hydrate | Sakshi
Sakshi News home page

Summer Health tips: సమ్మర్‌లో హైడ్రేషన్‌ కోసం..! కానీ ఈ పొరపాట్లు చెయ్యొద్దు..

Apr 17 2026 5:13 PM | Updated on Apr 17 2026 5:59 PM

Summer Health tips: Is There A Wrong Way To Hydrate

వైశాఖం రాకమునుపే సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. భానుడి సెగ మాములుగా లేదు. ముఖ్యంగా పెద్దలు, చిన్నపిల్లలు, గర్భిణిలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా డీ హైడ్రేషన్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందరూ సమ్మర్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం కోసం.. నీళ్లు దగ్గర నుంచి పండ్లు, తీసుకునే ఆహారం వరకు ఈ పొరపాట్లు చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. దాంతో తీవ్ర డీహైడ్రేషన్‌ బారినపడి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకుంటారుని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండకాలం హైడ్రేషన్‌గా ఉండటం కోసం చేయకూడని పొరపాట్లు ఏంటో ఆరోగ్య నిపుణుల మాటల్లోనే చూద్దామా..!.

ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం
దాహం వేసిందనో మరే కారణంగానో ఒకేసారి ఎక్కువ నీరు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఎక్కువ పరిమాణాంలోని నీరు కణాలకు సమర్ధవంతంగా అందుకుండానే బయటకు వెళ్లిపోతుందట. అరలీటరు నీరు తాగితే నాడీ వ్యవస్థ కార్యచరణ మెరుగ్గా ఉంటుందట. అంతకుమించి తాగితే శరీరంలోని కణాలకు తేమ అందకుండా పోతుందని అధ్యయనాల్లో వెల్లడైందని చెబుతున్నారు.

నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఎంచుకోకపోవడం..
శరీరానికి తేమను అందించడానికి కేవలం నీరు మాత్రమే కాకుండా ఆహారం కూడా తోడ్పడుతుంది. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మజాతి పండ్ల వంటివి ద్రవాల శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి వేడి వాతావరణంలో  తేమను నిలుపుకోవడానికి, శక్తి స్థాయిలను కాపాడుకోవడానికి సహాయపడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

డీహైడ్రేషన్‌ను తీవ్రతరం చేసే పానీయాలు ..
చాలామంది ఎంత ఎండకాలం అయినా.. కాఫీ, టీలు పడాల్సిందే లేదంటే కష్టం. వేసవిలో ఇవి శరీరానికి తగినంత నీరు సమర్థవంతంగా అందకుండా చేస్తుందట. అలాగే కూల్‌డ్రింక్‌లు, ఇతర పానీయాలు శరీరానికి నీరు అందుతుందన్న భావనను కలిగిస్తాయి గానీ ఇవన్నీ డీహైడ్రేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయని అంటున్నారు.

హైడ్రేషన్‌ స్థిరంగా ఉండదట..
హైడ్రేషన్ అవసరాలు స్థిరంగా ఉండవని అంటున్నారు.  శారీరక శ్రమ, వయస్సు, మొత్తం ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మన యూరిన్‌ రంగు ఆధారంగా మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలా అంటే..మూత్రం రంగు మరి చిక్కగా పసుపు రంగులో ఉంటే వేడి అధికంగా ఉందని, తక్కువ పసుపు రంగులో ఉంటే..తగినంతగా నీరు తీసుకోవాలని..అలా కాకుండా నీళ్లలా ప్యూర్‌గా  ఉంటే..శరీర హైడ్రేటెడ్‌గా ఉందని అర్థమట.

వేళకు తగిన నీరు అత్యంత ముఖ్యం..
నీరు తాడం మాత్రమే చూస్తాం. ఎంత వ్యవధిలో తాగుతున్నాం అనేది ముఖ్యం. చాలా సమయం అయ్యాక తగితే..అంత ప్రభావవంతగా ఉండదు. పైగా దీని కారణంగా బయటకు వెళ్లిన వెంటనే వడదెబ్బ బారిన పడతామని అంటున్నారు. అలాగే భోజనంలో బాగా ఆయిల్‌తో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలంటున్నారు. తేలికపాటి కాలనుగుణ భోజనమే మేలని చెబుతున్నారు.

ఎండకు గురైన వెంటనే నీళ్లు తాగటం..
తీవ్రమైన ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటినీళ్లు అస్సలు తాగకూడదల. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగించి, శరీర ద్రవాలు సమర్థవంతంగా శోషించబడటాన్ని నెమ్మదింపచేస్తుందట. అందుకుని నీళ్లు లేదా కొబ్బరి నీళ్లను తాగే ముందు ఎండకు గురైన శరీరం తగిన ఉష్ణోగ్రతకు స్థిరపడే వరకు ఆగి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

ఇళ్లలో, జర్నీ సమయాల్లో చేసే తప్పిదాలు..
ఇంటి వద్ద, కార్యాలయాల్లో ఉన్నప్పుడూ అంతగా నీరు తీసుకోవడం మర్చిపోతుంటారట. రిలాక్స్‌ అయిపోయి నీడ పట్టునే ఉన్నాం కదా అని తగినంత నీరు తీసుకోరని అంటున్నారు. అందువల్ల ఇలా అస్సలు చెయ్యొదని హెచ్చరిస్తున్నారు.

ఉప్పుని మరింత దూరంగా ఉంచడం..
ఈ కాలంలో చెమటలు పట్టి..శరీరంలో ఎలక్ట్రోలైట్లు నష్టం ఎక్కువగా ఎదుర్కొనాల్సి ఉంటుందట. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఉప్పును పూర్తిగా మానుకోవడం వల్ల, ఖనిజాలు కోల్పోయి కొన్నిసార్లు నీరసం, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవ్వుతాయని అంటున్నారు.

డీహైడ్రేషన్  పెద్ద సమస్య కాదనే అభిప్రాయం..
నిజానికి డీ హైడ్రేషన్‌ మన మానసిక స్థితి, ఏకాగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. అధిక వేడి పరిస్థితులు దేనిపై స్థిమ్మితంగా ఆలోచించేలా చేయనివ్వదట. అందుకే తగినంత నీరు తాగితేనే మన శరీరం యాక్టివ్‌గా ఉండి..ఏ పనైనా సులభంగా చేయగలుగులతామని చెబుతున్నారు నిపుణులు.

(చదవండి: Weight loss: వ్యాయామాలు చేయకుండానే 13 కిలోలు..! ఆ అమ్మ ఫిట్‌నెస్‌ మంత్ర..)

 

Advertisement
 
Advertisement
Advertisement