రష్యన్‌ మహిళకు వింత అనుభవం : రీల్‌ తెచ్చిన తంటానేనా? | Russian woman alleges Delhi airport official wrote his phone number on her ticket | Sakshi
Sakshi News home page

రష్యన్‌ మహిళకు వింత అనుభవం : రీల్‌ తెచ్చిన తంటానేనా?

Published Wed, May 1 2024 3:35 PM | Last Updated on Wed, May 1 2024 3:39 PM

Russian woman alleges Delhi airport official wrote his phone number on her ticket

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ర‌ష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి  చేదు అనుభ‌వం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్‌ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వ‌డంతో పాటు మళ్లీ ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు  కాల్  చేయాలని  పేర్కొన్నాడన్న  ఆరోపణలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్‌ టైం వచ్చినపుడు  సంప్రదించాలని పేర్కొన్నట్టు  దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్‌ పాస్‌ను కూడా  చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?"  అంటూ  ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్‌  కూడా నిర్వహించింది.

అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. 

అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్‌ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే  సదరు ఆ అధికారి   అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది.  గోడపై పోస్టర్‌ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్‌  రావడం గమనార్హం. 

 

భారతదేశంలో పర్యటిస్తూ  తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంద్వారా పాపులర్‌ అయింది దినారా.  ప్రస్తుతం  స్వదేశానికి వెళ్లి పోయింది.  మాస్కో నుండి  ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్‌ చేస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement