అందాల పోటీల్లో ఒంటెలపై అనర్హత | Over 40 camels were disqualified from the King Abdulaziz Camel Festival in Saudi Arabia | Sakshi
Sakshi News home page

అందాల పోటీల్లో ఒంటెలపై అనర్హత

Mar 22 2026 12:34 AM | Updated on Mar 22 2026 12:34 AM

Over 40 camels were disqualified from the King Abdulaziz Camel Festival in Saudi Arabia

ఒమన్‌లో ఇటీవల ఒంటెలకు అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో ఒంటెలు క్యామెల్‌ వాక్‌ చేస్తూ వయ్యారాలు ఒలకబోశాయి. వేలాది మంది జనాలు ఈ పోటీలను అబ్బురంగా తిలకించారు. న్యాయ నిర్ణేతలు ఒక్కొక్క ఒంటెనూ నిశితంగా పరిశీలించారు.

పోటీల్లో పాల్గొన్నవాటిలో ఇరవై ఒంటెలపై అనర్హత వేటు వేశారు. ఎందుకంటారా? తమ ఒంటెలు అందంగా కనిపించడానికి యజమానులు వాటికి బోటాక్స్‌ ఇంజెక్షన్లు ఇప్పించారు. బోటాక్స్‌ ఇంజెక్షన్లతో వాటి పెదవులు, చెక్కిళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా తీర్చిదిద్దించి మరీ పోటీకి తీసుకొచ్చారు. ఈ సంగతి కనిపెట్టిన న్యాయనిర్ణేతలు, అందాల పోటీల్లో కృత్రిమ సౌందర్యానికి చోటులేదని కరాఖండిగా తేల్చి చెప్పి, ఇరవై ఒంటెలను పోటీ బరి నుంచి తప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement