విల్‌ ఉంటేనే పవర్‌ సాధ్యం | Neelima Seepani is crowned Mrs Unity Asia 2025 | Sakshi
Sakshi News home page

విల్‌ ఉంటేనే పవర్‌ సాధ్యం

Sep 17 2025 1:59 AM | Updated on Sep 17 2025 2:00 AM

Neelima Seepani is crowned Mrs Unity Asia 2025

మిస్ట్రెస్‌ యూనిటీ ఆసియా 2025

విల్‌ పవర్‌తోనే అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చు‘ ఇంటి వద్ద ఉంటూ కూడా మన కలలను సాధించుకోవచ్చు అంటున్నారు హైదరాబాద్‌ వాసి నీలిమా సీపాని. ఆన్‌లైన్స్  మ్యాథ్స్‌ ట్యూటర్‌గా ఇంటినుంచే వర్క్‌ చేస్తూ ఇటీవల ఢిల్లీలో జరిగినపోటీలలో మిసెస్‌ యూనిటీ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ జీవనం కొనసాగిస్తూనే విద్యార్థులను తీర్చిదిద్దే ట్యూటర్‌గా బిజీగా ఉంటూ రన్‌వే వేదికలపైనా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు నీలిమ. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే.. తనప్లానింగ్‌ను ఇలా మన ముందుంచారు.

‘‘బీఎస్సీ మ్యాథ్స్‌ తర్వాత ఎంబీయే చేశాను. పెళ్లయ్యాక మావారు నందకుమార్‌ యతిరాజులు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాను. ఇద్దరు కూతుళ్లు. ఆరేళ్లక్రితం ఇండియాకి వచ్చేశాం. పిల్లల బాగోగులు, వారి చదువులు, కుటుంబం అంటూ చాలా పనులను పక్కన పెట్టక తప్పలేదు. ఇండియా వచ్చాక క్యూ మ్యాథ్‌ ఆన్‌లైన్‌లో ట్యూటర్‌గా చేరాను. విదేశాలలో ఉండే పిల్లలు నాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. అందుకని, సాయంకాలం నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆన్‌లైన్‌లోనే పిల్లలకు క్లాసులు తీసుకుంటూ ఉంటాను. పేద విద్యార్థులకు ఉచితంగా చెబుతుంటాను.

నైట్‌ షిఫ్ట్స్‌.. బిజీ షెడ్యూల్‌
పగలు పడుకొని, రాత్రిళ్లు డ్యూటీ చేస్తే మన అన్ని అలవాట్లలోనూ, ఆరోగ్యంలోనూ చాలా మార్పులు వస్తాయి. అందుకని, రోజూ జిమ్‌కి వెళ్లడం, హెల్దీ ఫుడ్‌ తీసుకోవడంపై దృష్టి పెట్టాను. ఏడాదిక్రితం ఆన్‌లైన్‌లోనే ముంబయ్‌లోని మిథాలీ మోడలింగ్‌ అండ్‌ మోర్‌కి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాను. ఢిల్లీలో కిందటి నెలలో జరిగిన మిసెస్‌ యూనిటీ వరల్డ్‌ ఆసియా– 2025లో టైటిల్‌ రావడం నిజంగా చాలా ఆనందాన్నిచ్చింది.

టాలెంట్‌ రౌండ్, ఫ్యాషన్‌ రౌండ్, ఈవెనింగ్‌ గౌన్‌ రౌండ్‌.. ఇలా ఆరు రౌండ్లలో ఎంపిక చేశారు. ఈ ఫ్యాషన్‌ షోలోపాల్గొనడం, టైటిల్‌ గెలుచుకోవడం దాదాపు ఏడు నెలలుగా నా బిజీ షెడ్యూల్‌ మధ్యేప్లాన్‌ చేసుకున్నాను. మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటూ ప్రిపేర్‌ అయ్యాను. రోజూ గంటసేపు జిమ్, తక్కువ కార్బోస్, ఎక్కువ ్ర΄÷టీన్లు ఉండే ఆహారం రోజుకు 6–7 సార్లు తీసుకునేలాప్లాన్‌ చేసుకున్నాను. ఇంటిపని, ట్యూషన్, హెల్త్‌ప్లానింగ్, నిద్ర.. వీటన్నింటికీ టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. నాలుగు రోజులు మాత్రం ముంబయ్‌లో ఉండి.. రన్‌వే పైన వాక్,పోజెస్, జడ్జీలు అడిగిన ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమాధానాలు... శిక్షణ తీసుకున్నాను.

స్వయంగా ఎంపిక
మాకు కలర్‌ కోడ్‌ ఇచ్చారు. లాంగ్‌ గౌన్స్‌ చెప్పారు. దీంతో కాస్టూమ్స్‌ అన్నీ నేనేప్లాన్‌ చేసుకున్నాను. నాకు ఇష్టమైన పీకాక్‌ థీమ్‌తో ఈవెనింగ్‌ గౌన్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి, ప్రిపేర్‌ చేయించుకున్నాను. హై ఫ్యాషన్‌ తోపాటు ధోతీ–కుర్తా వంటి ఇండో వెస్ట్రన్‌ లుక్స్‌ కూడా క్రియేట్‌ చేశాను. నా స్కూల్‌ రోజుల్లో భరతనాట్యం నేర్చుకున్నాను. ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్లలో ప్రదర్శనలు ఇస్తూ ఉంటాను. ఆ అనుభవంతో కాంతారా సినిమా సాంగ్‌ని రెండున్నర నిమిషాలు కంపోజ్‌ చేసి, దానిని ప్రదర్శించాను. అందుకు తగిన కాస్ట్యూమ్, జ్యువెలరీని నేనే ఎంచుకున్నాను. ్రపోగ్రామ్‌ మొత్తం ఆరు రోజులపాటు జరిగింది.

 ప్రతిరోజూ ఉదయం టీ టైమ్‌ ఉంటుంది. టీమ్‌ అందరితో ఎలా కలుస్తాం, మనతో మనమే ఉంటున్నామా.. అనేది కూడా పరిశీలనలో ఉంటుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన వారున్నారు కాబట్టి, అందరితో మన ర్యాపో ఎలా ఉందో కూడా చూస్తారు. ఇలాంటప్పుడు మన డ్రెస్సింగ్, మేకప్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సెల్ఫ్‌మేకప్‌ కూడా వచ్చి ఉండాలి. 

నన్ను నేను ఇలా రూ పొందించుకోవడానికి మా అత్తగారి సపోర్ట్‌ చాలా ఎక్కువ. బాగా ఎంకరేజ్‌ చేస్తారు. నవంబర్‌లో మరొక ఫ్యాషన్‌ షో ఉంది. దానికిప్లాన్‌ చేస్తున్నాను. రాబోయే మిసెస్‌ యూనిటీ ఫ్యాషన్‌ షోకు జడ్జ్‌గా ఉండబోతున్నాను’’ అని వివరించారు ఈ మల్టీ టాలెంటెడ్‌ టీచర్‌ అండ్‌ మిస్‌ యూనిటీ టైటిల్‌ విన్నర్‌. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్‌ ప్రతినిధి

యూనిటీ షో అంటే...
ఒక కాజ్‌ గురించి ఈ షో రన్‌ చేస్తున్నారు. నేను చేస్తున్న వర్క్‌ పైనే జడ్జీలు ప్రశ్నలు వేశారు. నా బిజీ షెడ్యూల్‌ప్లానింగ్‌ గురించి అడిగినప్పుడు ‘విల్‌ పవర్‌ ఉన్నప్పుడే టైమ్‌ క్రియేట్‌ చేసుకుంటాం’ అని చెప్పాను. ‘టీచింగ్‌లో ఉన్నాను. యాక్టివిటీస్‌ చేస్తున్నాను. ఈ టైటిల్‌ వల్ల ఇంటా, బయటా పేరు వస్తుంది, ఆర్థికపరంగానూ మంచి మార్పులు వస్తాయి’ అని చెప్పాను. మేం తీసుకుంటున్నది ఆన్‌లైన్‌ క్లాస్‌లు. పక్కన కూర్చోబెట్టుకొని చెప్పలేం. ఆన్‌లైన్‌లోనే వాళ్లని మోటివేట్‌ చేయాలి. అది ఎలా చేస్తానో.. వివరించాను. పేరెంట్స్‌తోనూ, పిల్లలతోనూ రిలేషన్‌షిప్‌ ను ఎలా డెవలప్‌ చేస్తానో చెప్పాను. మా పెద్దమ్మాయి ఇంజినీరింగ్‌ థర్డ్‌ ఇయర్‌. చిన్నమ్మాయి 8వ తరగతి చదువుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement