రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్‌! | Nandiniy Singh Started Chaasmi Reviving Royal Elegance While Uplifting Kaarigars, Success Story In Telugu | Sakshi
Sakshi News home page

రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్‌!

Aug 2 2024 12:26 PM | Updated on Aug 2 2024 1:35 PM

Nandiniy Singh Started Chaasmi While Uplifting Kaarigars

మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత ఫ్యాషన్‌ ఉండేది. అయితే ఇప్పటిలా దానికి అంతలా క్రేజ్‌ లేకపోయినా నాటి రాజరికపు కుటుంబాలు గొప్ప గొప్ప డిజైనర్‌ వేర్‌ దుస్తులను ధరించేవారు. నాటి కాలంలో చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్‌వేర్‌ చీరలు గురించి చాలమందికి తెలియదు. నాటి కాలంలో ఎంబ్రాయిడరీ చేయడం ఉందా అనుకుంటారు. కానీ ఆ కాలంలోనే హస్తకళాకారులు నైపుణ్యం ఆశ్చర్యచకితులను చేసేలా అద్భుతంగా ఉండేది. నాటి స్మృతుల్ని మరచిపోకుండా చేసేలా మన రాజరికపు దర్పానికి గుర్తుగా అలనాటి సాంప్రదాయ దుస్తులను చక్కటి  బ్రాండ్ నేమ్‌తో అందరికీ చేరువయ్యేలా చేస్తోంది నందినిసింగ్‌. ఎవరీ నందిని సింగ్? ఎలా అలనాటి రాజరికపు సాంప్రదాయ దుస్తులను వెలుగులోకి తీసుకొస్తోందంటే..

అవద్‌ రాజ కుటుంబానికి చెందిన నందిని సింగ్‌ కరోనా మహమ్మారి సమయంలో రాజుల కాలం నాటి దుస్తులకు సంబంధించిన బ్రాండ్‌ని నెలకొల్పింది. అంతేగాదు అలనాటి సాంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించడమే కాకుండా నాటి సాంప్రదాయ చీరలను ప్రస్తుత జనరేషన్‌ తెలుసుకునేలా మంచి బ్రాండ్‌ నేమ్‌తో పరిచయం చేస్తోంది. ఈ రాజరికపు సంప్రదాయ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో ప్రదర్శిస్తోంది. ఈ బాండ్‌కి చెందిన దుస్తులు  రాయల్ ఫేబుల్స్ వెడ్డింగ్ ఎడిట్‌లోనూ, ప్యాలెస్ అటెలియర్స్ అండ్‌ డిజైన్ స్టూడియోలలో ప్రదర్శనలిచ్చింది. 

ఈ మేరకు నందిని తన బ్రాండ్‌ జర్నీ గురించి మాట్లాడుతూ..తన గ్రామంలోని ఒక ఎన్జీవోకి సంబంధించిన పనిపై..ఝూన్సీ, లక్నో వంటి మెట్రోపాలిటన్‌ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడూ.. ఎందరో హస్తకళకారులు తన వద్దకు వచ్చి తమ సమస్యను వివరించడంతో దీనిపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. అ‍ప్పుడే వారందర్నీ ఒక కమ్యూనిటీగా చేసి..షిఫాన్‌లు, ఆర్గాంజస్ వంటి బట్టలపై ఎంబ్రాయిడీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది.. అది ఒకరకంగా వారికి పని కల్పించినట్లు అవుతుంది కూడా అని భావించింది నందిని. అందుకోసం అని హోల్‌సేల్‌ వ్యాపారులను సంప్రదించి మరీ హస్తకళకారులకు ఉపాధి దొరికేలా చేసింది. 

ఆ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పేరుని మహాభారతం నుంచి తీసుకుంది. ఆ పురాణ గాథలో శ్రీకృష్ణుడు అనే చా అస్మీ (నేను అన్నాను) అనే సంస్కృత పదాన్ని తన దుస్తులకు బ్రాండ్‌ నేమ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ సంప్రదాయ డిజైన్‌లను మంచి బ్రాండ్‌ నేమ్‌తో తీసుకురావడంలో ప్రేరణ తన తల్లి, అమ్మమ్మ, అత్తలే కారణం అంటోంది. ఎందుకంటే వారు ధరించే ఎంబ్రాయిడరీ చీరలతో తనకున్న చిన్న నాటి జ్ఞాపకాలే దీన్ని ఫ్యాషన్‌వేర్‌గా తీసుకొచ్చేందుji దారితీసిందని చెబుతోంది. 

"ఇక ఈ చాస్మీ బ్రాండెడ్‌ చీరలను హస్తకళకారులు సింగిల్-థ్రెడ్ వర్క్ లేదా 'సింగిల్ టార్'తో ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. అందుకోసం పట్టుదారాలను ఉపయోగిస్తారు. అయితే ఈ ఎంబ్రాయిడరీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎక్కువ దారాలను మిక్స్‌ చేయడం జరుగుతుంది. కానీ హస్తకళాకారులు మాత్రం సింగిల్‌ దారంతోనే ఎక్కువ సమయం కేటాయించి మరీ తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కూడా. 

అలాగే పిట్టా, జాలీ,  రేషం ఎంబ్రాయిడరీతో సహా వివిద రకాల వర్క్‌లు చేస్తారు. అంతేగాదు శాలువాలు, లెహంగాలు, దుపట్టాలు, చీరలు, బ్లౌజ్‌లపై కూడా  ఎంబ్రాయిడరీ చేస్తాం". అని నందిని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అలనాటి రాజవంశ మహిళలు ధరించే ఎంబ్రాయిడరీ చీరలను ఎలా ఉంటాయో చూసేయండి. 

 

(చదవండి: కట్టడితో పిల్లలను గడప దాటేలా చెయ్యొద్దు..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement