ఫుడ్‌ ఇంజనీర్‌..మిల్లెట్‌ బిజినెస్‌తో నెలకు రూ. 3 లక్షలు | Meet Palak Arora, founder of Millium Food Engineer earns Rs 3 Lakh Monthly Millet Business | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఇంజనీర్‌..మిల్లెట్‌ బిజినెస్‌తో నెలకు రూ. 3 లక్షలు

Sep 19 2025 10:21 AM | Updated on Sep 19 2025 10:30 AM

Meet Palak Arora, founder of Millium Food Engineer earns Rs 3 Lakh Monthly Millet Business

పలక్‌ గారి పౌష్ఠిక రుచులు 

అవసరం అన్నీ నేర్పించడమే కాదు.. ప్రయోగాల దిశగా ప్రేరేపిస్తుంది కూడా!అలాంటి ఒకానొక అవసరమే ఢిల్లీ వాసి పలక్‌ అరోరాను ఆంట్రప్రెన్యూర్‌గా మార్చింది! సద్గురు సూపర్‌ ఫుడ్స్‌’ను స్థాపించేలా, ‘మిల్లియమ్‌’ బ్రాండ్‌ను లాంచ్‌ చేసేలా చేసింది!కాలంతో పరుగులు పెడుతున్న కుటుంబాలకు దాన్నో వరంలా అందించింది! అయితే.. ఫుడ్‌ టెక్నాలజీలో ఎఫ్‌ఎస్సెస్సీ (ఊ  ఇ) 22000 లీడ్‌ ఆడిటర్‌ సర్టిఫికెట్‌ పొందిన ఆమె  ప్రయాణం హైటెక్‌ ల్యాబ్‌లోనో.. స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌లోనో మొదలవ్వలేదు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌టీఈఎమ్‌) థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు.. కోవిడ్‌ లాక్‌ డౌన్‌ టైమ్‌లో మొదలైంది.

ఆ అవసరం ఏంటంటే.. 
కోవిడ్‌ టైమ్‌లో ఇమ్యూనిటీని పెంచేదేగాక  తేలికగానూ వండుకోగలిగే  ఫుడ్‌ కోసం ఆన్‌లైన్‌లో వెదకడం మొదలుపెట్టింది. ఆ జాబితాలో రా మిల్లెట్స్‌ ... లేదంటే ముతక పిండే కనబడసాగింది. తప్ప రెడీ టు కుక్‌ లేదా రెడీ టు ఈట్‌ ప్రొడక్ట్స్‌ ఏమీ కనిపించలేదు. మిల్లెట్స్‌ పౌష్టికాహారమని అందరికీ తెలుసు.. కానీ వాటిని రాత్రంతా నానబెట్టడం,  తెల్లవారి ఉడకబెట్టడం లాంటి సుదీర్ఘ ప్రక్రియ లేకుండా అప్పటికప్పుడు అత్యంత తేలికగా వండటమెలాగో ఎవరికీ తెలియదు. పలక్‌ ఆలోచనల్లో ఉన్నప్పుడే ఆమె తండ్రికి కిడ్నీ ఫెయిల్యూర్‌ అని నిర్ధారణ అయింది. దీర్ఘకాలంగా మైక్రోన్యూట్రియెంట్స్‌ అందక΄ోవడం వల్లే వాళ్ల నాన్నకు కిడ్నీ జబ్బు వచ్చిందని డాక్టర్స్‌ తేల్చారు. దాంతో తన అన్వేషణను మరింత వేగవంతం చేసింది.

చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!

పోషక విలువల బంచ్‌
ఈజీ టు కుక్‌ ఫుడ్‌ మీద ప్రయోగాల కోసం పలక్‌.. తమ ఇంటి టెర్రస్‌నే కిచెన్‌గా మార్చుకుంది. ఆమె కనిపెట్టిన తొలి వంటకాల్లో స్ప్రౌటెడ్‌ మిల్లెట్‌ పోరిడ్జ్, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ ఇడ్లీలు, పంజాబీ స్టయిల్‌ చీలా (పాన్‌కేక్‌ లాంటిది) వంటివి ఉన్నాయి. ప్రతి వంటకాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో వంద సార్లు టేస్ట్, టెస్ట్‌ చేయించేది. ‘నా ఈ ప్రయత్నాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా నాన్న మాత్రం నమ్మారు. ప్రోత్సహించారు. ప్రతి చాలెంజ్‌లో నాకు అండగా నిలబడ్డారు. నా బిగ్గెస్ట్‌ స్ట్రెన్త్‌ మా నాన్నే!’ అని చెబుతుంది పలక్‌ అరోరా.  2021లో ‘సద్గురు సూపర్‌ఫుడ్స్‌’ పేరుతో సంస్థను రిజిష్టర్‌ చేయించింది. 2022లో ‘మిల్లియమ్‌’ అనే బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది. దానికి హెల్దీ అండ్‌ జల్దీ అనే ట్యాగ్‌లైన్‌నూ పెట్టింది. ప్రిజర్వేటివ్స్,అడిటివ్స్‌ లేని ఈ ఫ్యూజన్‌ ఫుడ్‌ పోషకవిలువల సముదాయం. . మిల్లియమ్‌ ఉత్పత్తులన్నీ ఎఫ్‌ఎస్సెస్‌ఏఐ, ఏపిఈడీఏ, ఎమ్‌ఎస్సెమ్మీ, స్టార్టప్‌ ఇండియా ధ్రువీకరించినవే. 

అలా టెర్రస్‌ కిచెన్‌ నుంచి ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా ఎదిగిన ఆ బ్రాండ్‌ నెలకు ఎనిమిది టన్నుల రెడీ టు కుక్‌ ఆహారపదార్థాలను, 21 టన్నుల రెడీ టు ఈట్‌ మిల్లెట్‌  ప్రొడక్ట్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. రాగి సూప్, మిల్లెట్‌ నూడుల్స్,  పాస్తా, మిల్లెట్‌  పోహా నుంచి  పాన్‌కేక్స్‌ దాకా మొత్తం పదిహేను రకాల వెరైటీస్‌ ఉన్నాయి. అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. 

నేడు, ఆమె చిరు ధాన్యాల ఆధారిత ఆహార వ్యాపారం ద్వారా ప్రతి నెలా రూ. 3 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తుంది, సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో  మేళవించి చక్కటి ఆహారాన్ని అందిస్తోంది. అలాగే చిరు ధాన్యాల సాగును పూర్తిగా వదిలివేసిన గ్రామీణ రైతులను మిల్లెట్స్‌ సాగుదిశగా ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలుస్తోంది. ఆమె దగ్గర ప్రస్తుతం ఎనిమిది మంది ఉద్యోగులున్నారు. స్థానికంగా మరింతమంది మహిళలకు కొలువులిచ్చి తన సంస్థను విస్తరింపచేయాలనుకుంటోంది పలక్‌. 

‘ఈ మిల్లెట్‌ రివైవల్‌ అనేది కేవలం ఒక బిజినెస్‌ ఆపర్చునిటీయే కాదు సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, ఫుడ్‌ సెక్యూరిటీ కూడా. అందుకే పొలం నుంచి ఫోర్క్‌ దాకా ప్రతి దశలోనూ అవకాశాలను క్రియేట్‌ చేస్తూ  పౌష్టికాహారాన్ని అందించడమే మా లక్ష్యం. అదే నిజమైన విజయంగా భావిస్తాను’ అంటుంది పలక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement