
భౌతికంగా సాధించిన ప్రతి విజయం కొంతకాలం తర్వాత పెద్ద విజయాలుగా అనిపించవు కొందరికి. ఏదో అంతకుమించిన గొప్ప విజయం కోసం ఆరాటపడుతుంటారు. మనసుకు ఏదో తెలియని అశాంతి, వెలితి అనిపిస్తుంటుంది. అలా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్ణితులై..అన్నింటిని పరిత్యజించే స్థాయికి చేరకుంటున్నారు ఎందరో ఉన్నత విద్యావంతులు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళ బాబాలుగా మారిన ఎందరో అపార మేధవులను పరిచయం చేసి ఇది మన భారతదేశ ఆధ్యాత్మికతకు ఉన్న శక్తి అని చాటుతోంది.
ఎన్ని ఘనకార్యాలు చేసి గొప్ప విజయాల సాధించినా..ఆధ్యాత్మిక శక్తి ముందు దిగదుడుపే అని తేల్చి చెబుతోంది. అలానే భావించి అన్నింటిని పరిత్యజించి వేదాంత బోధనలు చేస్తున్నాడు ఈ ఐఐటీ గ్రాడ్యేయేట్. అతడిక కథ వింటే..అంతటి విలాసవంతమైన జీవితాన్ని అంత తృణప్రాయంగా ఎలా వదిలేయగలిగారని ఆశ్చర్యం కలగకమానదు..
ఆ ఇంజనీర్ గ్రాడ్యుయేట్ పేరు ఆచార్య జైశంకర్ నారాయణన్(IIT Graduate Shares How He Became A Monk). ఆయన 1992లో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఆయన 1993లో యూఎస్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న సమయంలోనే గురువు స్వామి దయానంద సరస్వతిని కలిశాడు. ఆయన వేదాంత బోధనలే ఆచార్య నారాయణన్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశాయి.
అక్కడ తన గురూజీ చెప్పిన ప్రవనంతో వేదాంతంపై ఆసక్తి కలిగింది. దీంతో 1995లో అమెరికా నుంచి స్వదేశానికి రాగానే నేరుగా గురుకులంటో ఒక రెసిడెన్షియల్ కోర్సులో చేరాడు. అక్కడ వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. అలా అక్కడే గత 20 ఏళ్లుగా నారాయణన్ వేదాంతం, సంస్కృతాన్ని బోధిస్తున్నాడు.
తాను ఐఐటీలో చేరినప్పుడు గొప్ప విజయం సాధించిన అనుభూతి కలిగింది. తనలాంటి వారెందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక ఎందుకనో ఇదేమంత గొప్ప విజయం కాదనే ఫీలింగ్ వచ్చింది. అన్ని విజయాలు ప్రస్తుతానికి మాత్రమే అనిపిస్తాయి. కానీ చివరికి అవన్నీ సాధారణమవుతాయి.
తదుపరి లక్ష్యం కోసం ఏంటన్నప్పుడే తనకిదేదో మంచి ఆత్మానందాన్ని ఇవ్వగలదని అనిపించింది. అలా తాను అన్నింటిని త్యజించి సన్యాసిలా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మహా కుంభమేళ(Maha Kumbh 2025) ఎందరో గొప్ప గొప్ప మేధావులైన సాధువులను(Monk) వెలుగులోకి తెచ్చింది. పైగా ఇది ఆచారం కాదు, మహాగొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం అని చెప్పకనే చెప్పింది.
(చదవండి: