Homemade Horlicks Recipe: ఇంట్లోనే హార్లిక్స్‌ ఇలా చేద్దామా!

Homemade Horlicks Recipe Prepared Eassily - Sakshi

బయట మార్కెట్లో దొరికే హార్లిక్స్‌ కొనాలంటే అందరి వల్ల కాకపోవచ్చు. ఎంత కొందామన్నా.. కనీసం వందల్లో.. ఉంటుంది దాని ధర. మరోవైపు పిల్లలుకు ఇలాంటి ఇవ్వలేకపోతున్నానే అనే బాధ కూడా ఉంటుంది. అలాంటి వారు చక్కగా కాస్త శ్రద్ధ పెట్టి ఇంట్లోనే హార్లిక్స్‌ చేసుకోండి ఇలా. అదీగాక మార్కెట్లో ఉండే హార్లిక్స్‌ రుచి కోసం ఏవేవో కలుపుతారనే పలు ఆరోపణలు ఉన్నాయి. అందులో కాస్త షుగర్‌, కోకో వంటి క్వాండెటీ ఎక్కువని రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. దాని బదులు ఇంట్లోనే హానికరం కానీ విధంగా మంచి హోం మేడ్‌ హార్లిక్స్‌ చేసుకోండి. అందుకు ఏం కావాలంటే..

హార్లిక్స్ తయారీకి ప్రధానంగా కావలసింది గోధుమలు. ముందుగా నాణ్యమైన గోధుమలను ఒకరోజు రాత్రి మొత్తం నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం కాటన్ వస్త్రంలో బాగా వడకట్టాలి. ఆ గోధుమలను చక్కగా ఆరబెట్టాలి. అనంతరం వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటిలో గుప్పెడు వేరుశనగలు, బాదం గింజలు జోడించాలి. అంటే వీటిని వేరువేరు పాత్రల్లో పోసుకొని దోరగా వేయించాలి. ఆ తర్వాత విడివిడిగా మిక్సీ పట్టాలి. ఇలా ఈ మూడింటి మిశ్రమాలను చక్కగా జల్లెడతో జల్లించుకోవాలి. జల్లించిన తర్వాత.. అందులో మెత్తటి చక్కెర పొడిని కలపాలి..

ఇలా అన్నింటిని కలిపిన పొడిని ఒక శుభ్రమైన గాజు గ్లాసులో పోసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పాలల్లో ఒక స్పూన్ వేసుకుని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇంట్లోనే మన చేత్తో తయారు చేసిన హార్లిక్స్‌ పిల్లలకు ఇస్తే ఆ ఫీలే వేరేలెవెల్‌. దీనివల్ల కృత్రిమ పదార్థాలు, కోకో పౌడర్ కలపని హార్లిక్స్ రుచిని మనం ఆస్వాదించవచ్చు. పైగా మన ఇంట్లో తయారు చేసుకున్నామనే సంతృప్తి ఉంటుంది. పోషకాహార నిపుణులు కూడా ఇలా ఇంట్లో చేసుకోవడమే మంచిదని చెబతున్నారు. మన ఆరోగ్యం కోసం ఈ మాత్రం కష్టపడలేమా? చెప్పండి!.

(చదవండి: 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు! అసలైన పద్ధతి ఇదే..!)

Election 2024

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top