కొత్తగా తల్లి అయిన మహిళల్లో తమకు పాలు పడకపోవడం అన్నది వారిలోని అ΄ోహ మాత్రమే. దాదాపుగా 90% నుంచి 95% మహిళల్లో తమ చిన్నారులకు కావాల్సినన్ని పాలు సమకూరుతాయి. అయితే అప్పుడే పుట్టిన బిడ్డ తాలూకు ఆకలి తీరుతెన్నులు తెలియకపోవడం లేదా బిడ్డను తమ నిపుల్ వరకు తీసుకెళ్లి బిడ్డను రొమ్ము పట్టించడం వంటి అంశాలపై కొత్త తల్లులకు అవగాహన లేకపోవడం లేదా పాలు పట్టడంలో బేబీ పొజిషన్స్ సరిగా కుదరక΄ోవడంతో బిడ్డ పాలు తాగక ఏడుస్తుండటంతో తమ పాలు బిడ్డకు సరిపోవడం లేదేమోనంటూ చాలామంది కొత్తగా తల్లులైన మహిళలు అపోహ పడుతుంటారు.
ఈలోపు బాటిల్ ఫీడింగ్‌తో పాలు పడుతుంటే తల్లి మాత్రమే కాకుండా ఎవరైనా తేలిగ్గా పట్టగలగడంతో పాటు తల్లిపాలతో పోలిస్తే కాస్త రుచిగానూ, బాటిల్‌తో తాగడానికి సులువుగానూ ఉండటంతో బిడ్డ పోత పాలకు తేలిగ్గా అలవాటు పడతారు. దాంతో చాలామంది తల్లులు తమ బేబీకి సరిపడినన్ని పాలు పడటం లేదేమోననే అపోహలో ఉండిపోతారు. నిజానికి ఈ అపోహలన్నీ తొలగించుకుని తల్లిపాలు పట్టడమే మేలు.
ఎన్నో వ్యాక్సిన్ల పెట్టుఈ తల్లిపాలు
తల్లులు ముందునుంచే తమ బిడ్డకు వీలైనంత మేర తల్లిపాలకు అలవాటు చేయడమే మంచిది. ప్రసవం అయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలు ఊరడానికి ఒకటి రెండు రోజులు పట్టవచ్చు. అయితే కొత్తగా తల్లి అయిన వాళ్లలో కొంతమేరకు నీళ్లలా పలుచగా ఉండే పాలను ముర్రుపాలు అంటారు.
నిజానికి ఈ ముర్రుపాలు ఎన్నెన్నో వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతమైనవి. అయితే ఇవి రెండుమూడు చుక్కల పరిమాణంలోనే వస్తున్నాయంటూ కొందరు తల్లులు వీటిని బిడ్డకు అంతగా పట్టించరు. కానీ వీటిని తప్పక బిడ్డకు తాగించాలి. ఈ పాలలో బిడ్డకు సుదీర్ఘకాలం ΄పాటు మేలు చేసే చాలా అంశాలు ఉంటాయి.
కొంతమేర మానసికమైన అంశాల ప్రభావం కూడా...
పాలు ఊరడంలో కొంతమేర మానసిక అంశాలూ దోహదపడతాయని చెప్పవచ్చు. తల్లిలో సమృద్ధిగా పాలు పడటానికి ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కారణమవుతుంది. ఇది మెదడు నుంచి వచ్చే సంకేతాల మేరకు విడుదల అవుతుంది.
కొత్త తల్లి ఏ మాత్రం మానసిక ఒత్తిడి లేకుండా రిలాక్స్‌డ్‌గా ఉండి, ప్రశాంతంగా కూర్చుని... నా బిడ్డకు సరిపడినన్ని పాలు నా దగ్గర ఉన్నాయనే భావనతో పాలు పడితే... తల్లి దగ్గర బిడ్డకు అవసరమైనన్ని పాలు సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక శాతం నుంచి 5% తల్లుల్లోనే పాలు ఊరడానికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే ఇలాంటి సమస్య ఏదైనా ఉంటే ల్యాక్టేషన్ నిపుణులు లేదా తమ డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
పై నుంచి పాలు పట్టడం తప్పనిసరి అయితే ఉగ్గుగిన్నెతోనే...
బిడ్డకు సరిపడా పాలు ఇవ్వలేని సందర్భంలో కొంతమంది పాత తల్లుల సలహా మేరకు బిడ్డకు బాటిల్ ఫీడింగ్ ఇస్తుంటారు. పైపోత పాలు కొంత రుచికరంగా ఉండటంతో పాటు బాటిల్ ఫీడింగ్ తేలిగ్గా ఉండటంతో బిడ్డ ఆ పాలకు అవవాటు పడి తల్లిపాలను అంతగా ఇష్టపడకపోవచ్చు.
అలా రెండుమూడు రోజుల పాటు బిడ్డకు పోతపాలో లేదా ఫార్మూలా పాలో తాగించాలంటే కేవలం ఉగ్గుగిన్నెతోనే పట్టించడం మంచిది. దాంతో భవిష్యత్తులో తల్లి నుంచి పాలు తాగే విషయంలో అయోమయపడకుండా మళ్లీ బిడ్డ సౌకర్యంగా పాలు తాగగలడు. బిడ్డ ఎంతగా పాలు తాగుతుంటే తల్లిలో అంతగా పాలు ఊరుతూ ఉంటాయి.
బిడ్డకు సరిపడా పాలు ఊరాలంటే...
ప్రసవం తర్వాత కొందరు మహిళల్లో బిడ్డకు సరిపోయినంతగా పాలు పడకపోతే వారిలో స్వభావికంగానే (నేచురల్‌గానే) పాలు సమృద్ధిగా పడేందుకు ఈ కింద పేర్కొన్న మార్గాలను అనుసరించవచ్చు. ఆ తల్లి తన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో పాటు పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
అంతేకాదు... ఆహారంలో నువ్వులు, వెల్లుల్లి, బెల్లం, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లతో పాటు మంచినీళ్లూ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లికి స్వాభావికంగానే బాగా పాలు పడే అవకాశం ఉంటుంది.
అవి అపోహలు మాత్రమే
సిజేరియన్ ప్రక్రియ ద్వారా కాన్పు అయిన చాలామంది తల్లులు తమకు సర్జరీ అయినచోట కుట్లలో చీము వస్తుందేమో అన్న ఆందోళనతో పప్పులు తీసుకోరు. నిజానికి పప్పుల్లో ఉండేది ప్రోటీన్లు అయినందున పప్పుతో చీము పట్టదు.
అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపోహతో తగినన్ని ద్రవపదార్థాలూ, ద్రవాహారాలు తీసుకోరు. బిడ్డకు జలుబు చేస్తుందనే తప్పుడు అభిప్రాయంతో పండ్లను తీసుకోరు. నిజానికి పండ్లలో తల్లీబిడ్డలలో తగినన్ని విటమిన్లు, ఖనిజలవణాలను భర్తీ చేయడంతో పాటు వాళ్లలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఉంటుంది. అందుకే ఈ తరహా అ΄ోహల జోలికి పోకుండా బాలింతకు మంచి పోషకాహారంతో పాటు, పండ్లరసాలతో చేసే ద్రవాహారాలు, నీళ్లు, పండ్లు ఇస్తూ ఉండటం అవసరం.
ఇక మరికొంత మంది తల్లులు తమ బిడ్డకు పాలు సరిపోవడం లేదనే అ΄ోహతో పోతపాలు పడుతుంటారు. బిడ్డ పాలు తాగిన తర్వాత రెండు నుంచి మూడు గంటల సేపు హాయిగా నిద్రపోవడంతో పాటు... రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు పక్కతడుపుతూ, వయసుకు తగినట్లు బరువు పెరుగుతుంటే మాత్రం ఆ బిడ్డకు తల్లి పాలు సరిపోతున్నాయని అనుకోవచ్చు. ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా ఇంకా పాలు సరిపోకపోతే అప్పుడు డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు, పాలలో కలిపే పొడులు వాడాల్సి రావచ్చు.
డాక్టర్ పృథ్వీ పేరం, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్‌స్టిట్రీషియన్ – గైనకాలజిస్ట్
నిర్వహణ: యాసీన్
(చదవండి: నో స్ట్రెస్..! రోగాల బారినడకుండా..)


