
రాగి అనేది శరీరంలోని ప్రతి కణజాలంలో కనిపించే ఒక ముఖ్యమైన ట్రేస్ మినరల్. ఇతర ఖనిజాల మాదిరిగా, శరీరం దానిని స్వంతంగా తయారు చేసుకోదు; మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తుంది. అనేక ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పోలిస్తే, ఎక్కువ రాగి అవసరం లేదు. అలాగని రాగి లోపిస్తే మాత్రం మెదడు పనితీరు మందగిస్తుంది. అందువల్ల రోజూ ఆహారంలో తగినంత కాపర్ ఉండేలా చూసుకుంటే మెదడు కణజాలం చురుగ్గా పని చేస్తుంది.
దానిద్వారా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. రాగి వివిధ న్యూరోహార్మోన్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, జన్యు వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, పిగ్మెంటేషన్‌ను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహిస్తుంది.
మెదడు ఆరోగ్యంలో...
మెదడు అభివృద్ధికి, దాని పనితీరుకు సరైన మొత్తంలో రాగి కూడా అవసరం. మానసిక స్థితి, ప్రేరణ, శ్రద్ధ, ఒత్తిడి ప్రతిస్పందనను నియంత్రించడం వంటి వివిధ మెదడు విధుల్లో రాగి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
అధిక రాగి స్థాయులు అల్జీమర్స్ వ్యాధికి కూడా దారితీస్తాయి. హిప్పోకాంపస్, సెరిబ్రల్ కార్టెక్స్ వంటి మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలలో న్యూరాన్ల పనితీరును అధిక స్థాయిలో రాగి ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటికి ఉపకరిస్తుంది.
రాగి అత్యధికంగా ఉండే ఆహారాలు ఆర్గాన్ మీట్స్, గుల్లలు, ఇతర సముద్ర ఆహారాలు, పౌల్ట్రీ, రెడ్ మీట్ వంటి జంతువుల నుండి తీసుకోబడిన ఉత్పత్తులు. మీరు డైటరీ కాపర్ కోసం జంతు ఉత్పత్తులను తినవలసిన అవసరం లేదు. అనేక మొక్కల ఆధారిత ఆహారాలు రాగికి సురక్షితమైన వనరులు.
మెదడు, ఎముకలు, కీళ్ళు, గుండె, ధమనులు, చర్మం, రోగనిరోధక వ్యవస్థ అంటే అనేక శారీరక ప్రక్రియలకు రాగి చాలా అవసరం కానీ అది లోపిస్తే ఎంత ఇబ్బందో, ఎక్కువ అయితే కూడా అంతటి హానికరం. అందువల్ల తగిన రాగి స్థాయులను నిర్వహించడం శరీర ఆరోగ్యానికి అత్యవసరం. మొక్కల ఆధారిత డైటరీ కాపర్‌బంగాళదుంపలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, డార్క్ చాక్లెట్, టోఫు చిక్పీస్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, అవకాడో, టర్నిప్ గ్రీన్స్, పాలకూర.
(చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్‌లో..)