Pregnancy Planning Tips: పెళ్లయి ఆరునెలలవుతోంది.. ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

Gynecology: Pregnancy Planning Tips For Newly Wed By Dr Bhavana Kasu - Sakshi

డాక్టర్‌ సలహా

మాకు పెళ్లయి ఆరునెలలవుతోంది. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాం. ఏవైనా టెస్ట్‌లు చేయించుకోవాలా? ఏవైనా వ్యాక్సిన్స్‌ అవసరమా? – పి. సుమీల, విజయవాడ

బిడ్డను కనాలనే ప్లానింగ్‌కు కనీసం మూడు నెలల ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.  ఇది మీ ఇద్దరి శారీరక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు, మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి అవసరమైన జెనెటిక్‌ టెస్ట్స్‌ చేయడానికి సహాయపడుతుంది. ఈ పరీక్షల వల్ల ఏమైనా మెడికల్‌ ప్రాబ్లమ్స్‌ ఉంటే తెలుస్తాయి. ఇవి ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే తెలియడం వల్ల ట్రీట్‌మెంట్‌ సులువవుతుంది.

కొన్ని రకాల అలర్జీలకు ముందుగానే చికిత్సను అందించే వీలుంటుంది. ఫ్యామిలీలో ఏవైనా జన్యుపరమైన లోపాలు ఉంటే జెనెటిక్‌ కౌన్సెలర్‌ను సంప్రదిస్తే.. రిస్క్‌ ఎంతో తెలుసుకుని.. ఇన్వెస్టిగేషన్స్‌ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి పరీక్షలు చేసి సమస్యలను కనిపెట్టవచ్చో చెప్తారు. అమ్మాయిల్లో రక్తహీనత అనేది సర్వసాధారణమైన సమస్య. పోషకా హారం, తగిన మందులతో ముందుగానే దాన్ని అరికట్టవచ్చు.

ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలను వేసుకుంటే బిడ్డకు స్పైన్, నెర్వ్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చే చాన్సెస్‌ తగ్గుతాయి. రుబెల్లా వ్యాక్సిన్, చికెన్‌పాక్స్‌ వ్యాక్సిన్, కోవిడ్‌ వ్యాక్సిన్స్‌ ముందే తీసుకోవాలి. థైరాయిడ్, సుగర్‌ టెస్ట్స్‌ చేసి .. ట్రీట్‌మెంట్‌ అవసరమైతే చేస్తారు. యూరిన్, వెజైనా ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నాయేమో చెక్‌ చేసి.. అవసరమైన యాంటీబయాటిక్స్‌ ఇస్తారు. ఇలా ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందే కౌన్సెలింగ్‌కి వెళితే పండంటి బిడ్డను కనొచ్చు. 
-- డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌.

చదవండి: Health Tips: నెలసరి మొదలయ్యే ముందు కూడా ఇలా జరగొచ్చు! ఇరిటేటింగ్‌గా ఉంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top